దేవేగౌడ పార్టీలో అయోధ్య ‘ఆహ్వనం’ చిచ్చు
x
ప్రధాని మోదీతో మాజీ ప్రధాని దేవేగౌడ

దేవేగౌడ పార్టీలో అయోధ్య ‘ఆహ్వనం’ చిచ్చు

అయోధ్య రామమందిర ఆహ్వనం దేవేగౌడ పార్టీ జేడీ(ఎస్) చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఆ పార్టీ కేరళ శాఖ తిరుగుబాటు చేసేలా ఉంది. వివరాలు


జేడీ(ఎస్) కేరళ శాఖలో అయోధ్య ఆహ్వనం వేరుకుంపటి పెట్టెలా కనిపిస్తోంది. పార్టీ అధినేత హెచ్ డీ దేవేగౌడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వనానికి తన సమ్మతి తెలపడంతో ఆ రాష్ట్ర శాఖలో సెగలు పుట్టిస్తోంది. కేరళలోని రూలింగ్ పార్టీ ఎల్డీఎఫ్ లో జేడీ(ఎస్) భాగస్వామిగా ఉంది.

ఎల్డీప్ లో అతిపెద్ద భాగస్వామి అయిన సీపీఎం ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది. రోజురోజుకి కాషాయదళానికి దేవేగౌడ దగ్గర అవుతున్నారని, వారి బంధాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు కేరళ వర్గాలు చెబుతున్న మాట. కేరళ జేడీ(ఎస్) శాఖ ఈ అంశం గురించి చర్చించేందుకు రాష్ట్ర రాజధానిలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఆఫీస్ బేరర్లు, డిస్ట్రిక్ బేరర్లు హజరుకానున్నారు.

రాష్ట్రస్థాయిలో బీజేపీతో, జేడీ(ఎస్) ఎలాంటి సంబంధాలు కొనసాగించట్లేదు. ఇటు ఎల్డీఎఫ్ కూటమితో ప్రభుత్వంలో కొనసాగుతున్నప్పటికీ, జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ అధినాయకత్వంతో అంటకాగుతోంది. ఇదే సీపీఎం నాయకత్వానికి రుచించడంలేదు.

పినరయ్ క్యాబినెట్ లోని మినిస్టర్ కే. కృష్ణమూర్తి మాత్రం ‘ కేరళలో జేడీ(ఎస్) కొత్త పార్టీగా పురుడు పోసుకోవడం ఖాయం’ అని జోస్యం చెప్పారు. అయితే పార్టీ ఎమ్మెల్యే మాథ్యూ మాత్రం ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో గెలవడం మంచి సంప్రదాయం కాదని అన్నారు.

ఇంతకుముందు కూడా ఇదే విషయంలో జేడీ(ఎస్) పార్టీలో నిప్పులు రాజేసింది. బీజేపీతో అంటకాగడం తనకు ఇష్ఠం లేదని కర్నాటక ఇంచార్జ్ దేవేగౌడ, కుమారస్వామి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు మరోసారి కేరళ శాఖలోనూ బీజేపీతో అంటకాగడం తీవ్ర నిరసనకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది.

కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా దెబ్బతింది. కేవలం 13.3 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. అంతకుముందు 2018లో జరిగిన ఎన్నికల్లో 18.36 శాతం ఓట్లను సాధించి కింగ్ మేకర్ గా మారింది. కొంతకాలం పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా వ్యవహరించింది. అయితే తరువాత జరిగిన పరిణామాలతో అధికారం చేజారింది. తరువాత జరిగిన ఎన్నికల్లో ఓట్లను, సీట్లను సైతం కోల్పోయి, బీజేపీతో అంటకాగడానికి ప్రయత్నిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More
Next Story