బాబూ, ఇక దుకాణం మూసేస్కో: సజ్జల సలహా
x
సజ్జల రామకృష్ణారెడ్డి

బాబూ, ఇక దుకాణం మూసేస్కో: సజ్జల సలహా

“ఆంధ్రప్రదేశ్‌తో అసలు సంబంధంలేని వ్యక్తి చంద్రబాబు. ఇక్కడకు గెస్ట్‌లాగా వస్తాడు. గెస్టులాగానే పోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలతో ఆయనకేం సంబంధం”


ఆంధ్రప్రదేశ్ లో ఇల్లూ వాకిలి లేని చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత దుకాణం మూసుకోవాల్సిందేనంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2024ఎన్నికల్లో చంద్రబాబుకు ఒక్క సీటూ రాదంటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం సహా అన్ని చోట్లా సైకిల్ ‘కిల్’ అవుతుందని సజ్జల జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే మూడు నెల్ల తర్వాత ఏపీ రాజకీయ చిత్రపటంలో కనిపించరని తెగేసి చెప్పారు వైసీపీ నాయకుడు, ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదేం చోద్యమనుకుంటున్నారేమో మీడియా వాళ్లందర్ని పిలిచి మరీ ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌లు ఏపీకి ఇక గెస్టులేనని కూడా ఖరాఖండితంగా చెబుతున్నారు. తాంత్రిక పూజలపై నమ్మకంతోనే అధికారంలోకి వస్తానని బాబు కలలుకంటున్నాడేమో..! ఆ పప్పులుడకవంటున్నారు సజ్జల. పచ్చ మీడియాలో పిచ్చిరాతలపై రోత ప్రెస్‌మీట్లు ఏమిటంటూ నిప్పులు చెరిగారు. ఉద్దానంపై కోతలు కోసిన పవన్ కల్యాణ్ ఇవాళ నోరెందుకు మెదపరని ప్రశ్నించారు. ఉద్దానం ప్రజల కోసం సీఎం జగన్ రెండు ప్రాజెక్టులు నిర్మించి ఆదుకుంటే ప్రశంసించడానికి కూడా నోరు రాని మనుషులు వీళ్లా ప్రజానాయకులు అని చీత్కరించారు.

మా పార్టీ మా ఇష్టం, మీకేం నొప్పి..

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని మార్చాలన్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిప్రాయం తీసుకోవాల్నా.. ఏం మాట్లాడుతున్నారు వాళ్లంటూ సజ్జల విరుచుకుపడ్డారు. మా పార్టీ, మా ఇష్టం, మా అభ్యర్థుల్ని మేము మార్చుకుంటే మీకొచ్చిన నొప్పేంటంటా అని నిలదీశారు సజ్జల. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పానికి మారినప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారా? అప్పుడు లేని రాద్ధాంతం ఇప్పుడెందుకు? వైఎస్‌ఆర్‌సీపీ ఫర్‌ఫెక్ట్‌ టీమ్‌తో ఎన్నికల బరిలోకి దిగుతుంది, దానికి చంద్రబాబు పర్మిషనేమీ అవసరం లేదన్నారు సజ్జల.

చెత్త రాతలు రాస్తే మేం పట్టించుకోవాల్నా

“ప్రజల్లో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే తన కుట్రల పంథాలో పోతుంది. నాలుగున్నరేళ్లుగా జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసే ప్రతీ పనినీ పచ్చ మీడియా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. అభూత కల్పనలతో చెత్త రాతలు రాయడం, వాటిని పట్టుకుని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం.. ఇదేమన్నా తమాషానా.. తమ హయాంలో జరగని అభివృద్ధి గడచిన నాలుగున్నరేళ్లల్లో చూస్తున్నామనే విషయాన్ని చంద్రబాబు, ఆయన పచ్చమీడియా జీర్ణించుకోలేకపోతుంది” అని సజ్జల ఏ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఏపీకి గెస్ట్ లా వస్తాడు.. గెస్ట్ లా పోతాడుః

“ఆంధ్రప్రదేశ్‌తో అసలు సంబంధంలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఇక్కడకు గెస్ట్‌లాగా వస్తాడు. గెస్టులాగానే పోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలతో ఆయనకేం సంబంధమని” ప్రశ్నించారు. 365 రోజుల్లో 300 రోజులు తెలంగాణలో ఉండి ఇక్కడకు గెస్టు మాదిరిగా వస్తూ జరిగే అభివృద్ధిపై ఏదొక అభూతకల్పనల్ని సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లుతాడా? అని నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి.

సజ్జల విమర్శలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Read More
Next Story