తెలంగాణలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధాస్త్రం
x
Gutka and Pan Masala

తెలంగాణలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధాస్త్రం

తెలంగాణ ఆహార భద్రతా విభాగం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల అనారోగ్యానికి కారకాలైన పొగాకు, నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం విధించింది.


పొగాకు, నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్‌ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

- పొగాకు,నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్ మసాలా ప్రమాదకరమైన పొగరహిత ఉత్పత్తులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.

ఏడాదిపాటు నిషేధం
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 30లోని సబ్‌సెక్షన్ (2)లోని క్లాజ్ (ఎ) కింద వచ్చిన అధికారాలను ఉపయోగించి ఆహార భద్రత, ప్రమాణాల శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు, నికోటిన్‌లను పొగాకు/పౌచ్‌లు/ప్యాకేజీ/కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్ మసాలాల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించారు. వీటి అమ్మకాలపై నిషేధం, పరిమితి రెగ్యులేషన్ 2011లోని 2.3.4 ప్రకారం ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు. మే 24 వతేదీ నుంచి ఒక సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ పేరుతో పిలిచినా గుట్కాలను నిషేధించారు.

గుట్కాతో ఆరోగ్య సమస్యలు
గుట్కా, పాన్ మసాలా వాడకం వల్ల నోటి క్యాన్సర్, నోటి సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దేశంలోని వారణాసిలో 55 శాతం క్యాన్సర్లు పొగాకు వినియోగానికి సంబంధించినవని తాజా పరిశీలనలో వెల్లడైంది. స్మోక్ లెస్ పొగాకు వాడకం దేశంలో 21.4 శాతం పెరిగిపోయింది. దేశంలో 10.7 శాతం అంటే 99.7 మిలియన్ల మంది పెద్దలు పొగాకును ఉపయోగిస్తున్నారు. పొగాకు వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని లాన్సెట్ అధ్యయనంలో తేలింది.

Read More
Next Story