‘తల్లావజ్జుల’ను వరించిన కేంద్ర సాహితీ పురస్కారం
x
తల్లావజ్జుల పతంజలి శాస్త్రి

‘తల్లావజ్జుల’ను వరించిన కేంద్ర సాహితీ పురస్కారం

ప్రముఖ రచయిత తల్లవజ్ఝుల పతంజలి శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు- మరికొన్ని కథలు అనే కథల సంపుటికీ ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం దక్కింది.


కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కే. శ్రీనివాసరావు 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు 2023 సంవత్సరానికి ఈ అవార్డులు ప్రకటించారు. దీనికి జ్యూరీగా బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వర రావు వ్యవహరించారు. ఈ సారీ 5 భాషల్లోని కథా సంపుటాలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటిలో తెలుగు నుంచి రామేశ్వరం కాకులు ఒక కథాసంపుటీ కావడం గమనార్హం.

మార్చి 12 న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డు కింద రూ. లక్షనగదు, తామ్రపత్రం బహూకరిస్తారు. పతంజలి శాస్త్రి 1945లో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు. తల్లి మహలక్ష్మీ, తండ్రి కృత్తివాస తీర్ధులు. ఒంగోలులో ఆయన విద్యాభ్యాసం గడిచింది. తరువాత పుణేలోని పురావస్తు శాఖకి సంబంధించిన అంశాలపై పీహెచ్ డీ చేశారు.

తరువాత అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తరువాత స్వచ్చందంగా పదవీవిరమణ చేసి తన జీవితాన్ని పర్యావరణానికి అంకింతం చేశారు. తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించిన బారిష్టర్ పార్వతీశం రాసిన మొక్కపాటి నరసింహ శాస్త్రి వీరికి వరుసకు తాత అవుతారు.

రామేశ్వరం కాకులు.. మరికొన్నికథలు, తాత్విక చింతనకు పర్యావరణ అంశాలను జోడించి రచించిన లఘు సంపుటి కథలు. మనచుట్టూ ఉన్న పాత్రలను కథా వస్తువులుగా మలచడంలో పతంజలి శాస్త్రిది అందే వేసిన చేయి. పాఠకుడి మేధస్సు సులువుగా అందుకోగల భాషతో రచనలు చేస్తుంటారు.

కనిపించే వాస్తవం ముందే ఉన్న దాని వెనక ఉన్న అసలు వాస్తవాన్ని ఆయన రచనలు ద్వారా వివరించే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఇప్పటి వరకూ 100 కథలు, నాటకాలు, నాలుగు నవలలు, వ్యాసాలు రాశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి ఆణిముత్యాలు ఆయన మస్తిష్కం నుంచి జాలువారి పేపర్ పై పరుగులెత్తాయి.

మగ వేశ్యల కథావస్తువుగా తీసుకున్న గేద మీద పిట్ట నవల ఓ ప్రత్యేకత. గాథా సప్తశతిలోని వంద కథలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. పతంజలి శాస్త్రి గారికి ఒక కుమారుడు, కుమార్తె.

Read More
Next Story