మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి
x
సీఎం రేవంత్ రెడ్డి

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి

హోంమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ


తెలంగాణ రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, అనంతరం మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించారు. మొత్తం 11 మంది ప్రమాణం చేశారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకమైన హోం శాఖ కేటాయించగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్, డీ. శ్రీధర్ బాబుకి ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖ, కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ, దామోదర రాజనర్సింహ కు మెడికల్, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు, సీతక్కకు గిరిజన సంక్షేమం, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ పొన్నం ప్రభాకర్ కు బిసి సంక్షేమ శాఖ లను కేటాయించారు.

ఎల్బీ స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అతిరథ మహరథులు హజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 1.22 నిమిషాలను ప్రమాణ స్వీకారం ప్రారంభం అయింది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణం అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ప్రజా పాలన తిరిగి తెస్తామని ప్రకటించారు. పదేండ్ల చీడపోయిందని అన్నారు. ప్రగతి భవన్ పేరును మహత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ పేరుగా మారుస్తున్నట్లు, రేపు ఉదయం పది గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అశేష జనవాహిని మధ్య ప్రకటించారు.

Read More
Next Story