తెలంగాణ బడ్జెట్‌లో కాంగ్రెస్ గ్యారంటీలకు ప్రాధాన్యం
x

తెలంగాణ బడ్జెట్‌లో కాంగ్రెస్ గ్యారంటీలకు ప్రాధాన్యం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించారు.


మహాలక్ష్మీ పథకం

మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణలోని మహిళలందరికీ టీజీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి చెప్పారు.ఈ పథకం కింద రూ.2,351 కోట్ల రూపాయలను మహిళలకు ఆదా చేశామని మంత్రి తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద 500రూపాయలకే గ్యాస్ సిలిండరును అర్హులైన వారికి ఇస్తున్నామని భట్టి చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేర్చనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ ను అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 45,81,676 మంది ఇళ్లలో వెలుగులు నింపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల కింద రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.

రుణమాఫీకి నిధులు
వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రుణమాఫీ కోసం బడ్జెట్ లో రూ.31 వేల కోట్లను కేటాయించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.15వేలను ఇస్తామని భట్టి ప్రకటించారు.భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని మంత్రి చెప్పారు.తెలంగాణలో 33 రకాల సన్న వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించేందుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు.


Read More
Next Story