
CPI పోరాటాలు వదిలేసి తోక పార్టీగా మిగిలిందా?
ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా, ఏదో ఓ పార్టీతో ఎన్నికల సర్దుబాటు చేసుకోవడం వల్లే, సి.పి.ఐ. తోక పార్టీగా మిగిలిపోయిందనుకోవచ్చా?
"తోక పార్టీ, ఈగ పార్టీ కాదు. భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థలో సీట్లు గెలిచి, చట్టసభల్లో ప్రాతినిధ్యం వుండాలంటే ఇతర పార్టీలతో సర్దు బాటు చేసుకోవాల్సిందే. మతవాద బిజెపికి వ్యతిరేకంగా ఇతర లౌకిక పార్టీలతో చేసుకున్న ఎన్నికల సర్దుబాటే అది. అంతే కానీ ఆ రాజకీయ పార్టీలకు తోకలా మారిపోయారనడం సరికాదు. ఎక్కడ లోపం వుందంటే ప్రజల్ని ఆకట్టుకోవడంలో, ప్రజల్ని పోరాటాల్లో, ఆర్థిక అంశాలపై సమీకరించుకోగలగుతున్నాం తప్పా, రాజకీయంగా వాళ్ళ ఓట్లు పొందడంలో విజయవంతం కాలేకపోతున్నాం’’ అని సి.పి.సి. జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది. పెద్ద పార్టీ అయినప్పట్టికీ 22 రాజకీయ పార్టీలతో కూటమి పెట్టుకుంది. ఇతర పార్టీల సహకారంతోనే మోదీ ప్రధాన మంత్రిగా వున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.

