దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు, ఇది ఫ్యాక్టా?ఫేకా?
ఒకవైపు రేవంత్ రెడ్డి పెట్టుబడుల్లో దూసుకుపోతుంటే ,ఇంకోవైపు చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారా?
ఇప్పుడు దావోస్ పెట్టుబడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంసంగా మారాయి. ఒకవైపు తెలంగాణకు రేవంత్ రెడ్డి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే, ఇంకో వైపు అమరావతికి చంద్రబాబునాయుడు ఏ రకమైన పెట్టుబడులు తీసుకురాలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు భారీ పెట్టుబడులే తీసుకువచ్చారు. కాని ఆంధ్రా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊహించిన రీతిలో ఒక్క వరల్డ్ బ్యాంక్ ది మినహాయిస్తే ప్రభావశీలమైన పెట్టుబడులు రాలేదు.2017 లో కూడా చంద్రబాబు నాయుడు దావోస్ కి వెళ్ళారు. ఇప్పటితో కలిపి ఆయన దావోస్ కి వెళ్ళడం నాలుగో సారి.అయినప్పటికీ ఇప్పుడు మళ్ళి ముఖ్యమత్రిగా వచ్చాక ,అందులోను భారీ ప్రచారం తర్వాత కూడా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ఊహించిన రీతిలో పెట్టుబడులు తీసుకురాలేకపోయరనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇంకోవైపు రేవంత్ రెడ్డి మాత్రం దూసుకుపోయారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక భవిష్యత్తుపై, సంపద సృష్టిపై, ఉద్యోగ కల్పన పై ఈ దావోస్ పెట్టుబడులు ఎలా ప్రభావం చూపించబోతున్నాయో అన్న విషయం మీద ఫెడరల్ తెలంగాణలో చర్చ.