రెడ్డి గాండ్ల కులం బీసీలు కాదు; ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
x

రెడ్డి గాండ్ల కులం బీసీలు కాదు; ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలలో బీసీ కోటా క్రింద తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేయకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారు


Click the Play button to hear this message in audio format

త్వరలో జరగబోతున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో బీసీ కుల ధృవీకరణ సర్టిఫికేట్ లు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ డిపార్ట్మెంట్ సర్క్యులర్ జారీచేసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కొందరు ‘రెడ్డి గాండ్ల’ కులానికి చెందిన వ్యక్తులకు ‘గాండ్ల’ కులానికి చెందిన వ్యక్తులుగా గుర్తించటం తప్పని బీసీ కమీషన్ ఈ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

రెడ్డి గాండ్ల కులానికి చెందిన వారు కొంత కాలంగా తమను బీసీ లలో చేర్చాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఇది వరకు రెడ్డి గాండ్ల కులానికి చెందిన వారికి గాండ్ల కులం సర్టిఫికేట్లు జారీ చేయాలని కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్ల కు 2, ఆగష్టు 2010 లో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

దీనితో పాటు ఇప్పటికే రాష్ట్ర బీసీల జాబితా నుండి తీసివేసిన ఆంధ్ర ప్రదేశ్ లో మూలాలు ఉన్న 26 కులాలకు చెందిన వ్యక్తులకు బీసీ సర్టిఫికేట్ లను జారీ చేయవద్దని మరో ఉత్తర్వులో చెప్పారు. వీటిని తీసివేస్తూ 14, ఆగష్టు 2014 లో జారీచేసిన ఉత్తర్వు 112 స్థానిక కులాలను బీసీ లుగా గుర్తించింది. 9, సెప్టెంబర్, 2020 లో ఇచ్చిన మరో ఆర్డర్ లో 17 కులాలను బీసీ లలో చేరుస్తున్నట్టు ఉత్తర్వు జారీ అయ్యింది.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలకు చెందిన ఎనిమిది మంది రాష్ట్రంలో బీసీ కోటా క్రింద ఎన్నిక అయినట్టు గుర్తించటం జరిగింది. త్వరలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరబోతున్న నేపధ్యంలో జారీ అయిన ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తప్పుడు బీసీ ధృవీకరణ సర్టిఫికేట్ల ఆధారంగా ఎన్నిక అయిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నకు బీసీ కమీషన్ ఛైర్మన్ జీ. నిరంజన్ ‘ఫెడరల్’ తో మాట్లాడుతూ, “కలెక్టర్ లను రిపోర్ట్ పంపమని కోరాము. తప్పుడు పత్రాలతో గెలిచిన వాళ్ళపై చర్యలను కోరుతూ బీసీ కమీషన్ తరపున ప్రభుత్వానికి రాస్తాము. ఒక కులాన్ని బీసీ లలో చేర్చాలంటే వారి సామాజిక ఆర్థిక పరిస్థితులపై స్పష్టత ఉండాలి. బీసీ కుల సర్టిఫికేట్ లు దుర్వినియోగం కాకుండా బీసీ సంక్షేమ డిపార్ట్మెంట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది,” అని చెప్పారు.

Read More
Next Story