
అసెంబ్లీలో ఫిరాయింపు నేతలు ఎక్కడ కూర్చున్నారో తెలుసా?
అసెంబ్లీలో కూర్చున్న ప్లేస్‌తోనే ఫిరాయింపు నేతలు తమ వైఖరిని స్పష్టం చేశారా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వీటిలో అన్నింటికన్నా ఆసక్తికర విషయంగా ఒకటి మారింది. అదే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదర్కొంటున్న నేతలు ఎక్కడ కూర్చుంటున్నారు? దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది. ఇటీవల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు కాబట్టి.. వారంతా బీఆర్ఎస్ వైపే కూర్చుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయింపు నేతలు ఎక్కడ కూర్చున్నారు? అనేది టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.
ట్రెజరీ బెంచ్‌లో ఫిరాయింపు నేతలు..
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి.. సోమవారం మొదలైన అసెంబ్లీలో అధికారపార్టీ వైపు కూర్చోవడం కీలకంగా మారింది. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా స్పీకర్ ప్రకటించినా.. వాళ్లు మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ కూర్చునే ట్రెజరీ బెంచ్‌లవైపు కూర్చున్నారు. దీంతో మరోసారి వాళ్లు తమ పార్టీని తేల్చి చెప్పారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ట్రెజరీ బెంచ్‌లలో ఫిరాయింపు నేతలు కూర్చోవడాన్ని బీఆర్ఎస్ గతంలో తప్పుబట్టింది. కాగా మరోసారి ఫిరాయింపు నేతలు అటే కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ట్రెజరీ బెంచ్‌లంటే..
అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్‌లు స్పీకర్‌కు కుడివైపుకు ఉంటాయి. వాటిలో అధికారపార్టీ మంత్రులు, ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తులు కూర్చుంటారు. వాళ్లు కూడా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు అధికారపక్షం తరుపు సమాధానాలు చెప్తారు. ఈ బెంచ్‌లను ప్రస్తుతం కాంగ్రెస్ ఆక్యుపై చేసి ఉంది. ట్రెజరీ బెంచ్‌లో ప్రభుత్వ పథకాలను డిఫెండ్ చేస్తూ, ప్రభుత్వంపై చేసే విమర్శలు తిప్పికొట్టడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

