గత సాంప్రదాయాలకు భిన్నంగా  ప్రోటెం స్పీకర్ ..
x
ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ

గత సాంప్రదాయాలకు భిన్నంగా ప్రోటెం స్పీకర్ ..

కొత్తగా కొలువుదీరనున్న తెలంగాణ మూడో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రేపు అంటే శనివారం జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది.


కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో శాసనసభ ముస్తాబు అవుతోంది. మొత్తం 119 ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకరాన్ని ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్ధీన్ నిర్వహించనున్నారు.

అధికరణ 188 ప్రకారం ప్రోటెం స్పీకర్ గా నియమించబడే వ్యక్తి సాధారణంగా సభలో అత్యంత సీనియర్ సభ్యుడై ఉంటారు. ఈ పద్ధతిన చూస్తే ఈసారి సభకు ఎన్నికైన అత్యంత సీనియర్ సభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అయితే.. గత సభలో స్పీకర్ గా పని చేసినందున ఆయన సాంకేతికంగా ఇంక స్పీకర్ గా ఉన్నట్లే. అయితే గవర్నర్ తరువాత సీనియర్ సభ్యుడిని నియమించాలి. ఈ సాంప్రదాయానికి భిన్నంగా ఎంఐఎం పార్టీ తరఫున చాంద్రాయణ గుట్ట నుంచి ఐదు సార్లు ఎన్నికైన అక్భరుద్దీన్ ఓవైసీని నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. ఎంఐఎం నుంచి ప్రొటెం స్పీకర్ అయిన రెండో సభ్యుడు అక్బరుద్దీన్, ఇంతకుముందు 2018 ఎన్నికల తరువాత ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా పని చేశారు. కాగా తెలంగాణ తొలి శాసనసభకు ప్రొటెం స్పీకర్ గా కుందురు జానా రెడ్డి పని చేశారు. ప్రొటెం స్పీకర్ సాంప్రదాయం భారత్, ఫ్రాన్స్ నుంచి తీసుకుంది. ప్రొటేం స్పీకర్ గా పనిచేస్తున్న వ్యక్తి స్పీకర్ కు పోటీ చేయాల్సి వస్తే ప్రోటేం స్పీకర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అక్భరుద్దీన్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప బీజేపీ ప్రత్యర్థి సయ్యద్ షహజాదీ పై 80 264 ఓట్ల మెజారీటితో గెలుపొందారు. అయితే ఎంఐఎం నేత అక్భరుద్దీన్ చేసే ప్రమాణ స్వీకారానికి తాను హజరు కాబోనని బీజేపీ నుంచి గెలిచిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. అయితే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎవరైన సభ్యులు హజరుకాకపోతే స్పీకర్ ఎన్నిక పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే సభలో ఓటు వేసే హక్కు ఉండదు. అంతేకాకుండా సభకు హజరు అయితే రోజు రూ.500 జరిమానా కట్టాల్సి ఉంటుంది.

హాజరుకాలేని స్థితిలో మాజీ సీఎం కేసీఆర్

ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ కొత్తగా కొలువుదీరనున్న శాసనసభలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ బాత్రూంలో కాలుజారీ పడటంతో ఎడమకాలు తుంటి ఎముకలో చిన్నగా పగుళ్లు వచ్చాయి. తుంటీ ఎముక మార్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ నేతృత్వంలోని వైద్య బృందం కేసీఆర్ కు శస్త్ర చికిత్స చేయనున్నారు. చికిత్స అనంతరం దాదాపు 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి మెడికల్ సూపర్నిండెంట్ తెలిపారు.

Read More
Next Story