జారిపడ్డ కెసిఆర్,  కాలికి గాయం
x
మాజీ సీఎం కేసీఆర్

జారిపడ్డ కెసిఆర్, కాలికి గాయం

ఆసుపత్రిలో చేరారు. చికిత్స జరుగుతూ ఉంది. త్వరగా కోలుకావలని ప్రధాని ట్వీట్


గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుడికాలికి గాయం అయింది. రాత్రి ఫామ్ హౌజ్ లోని బాత్రూమ్ లో కాలు జారి పడ్డారు.

దాంతో మాజీ సీఎం ను వెంటనే హైదరాబాద్ లోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కుడికాలి తుంటి ఎముకలో స్వల్పంగా చీలిక వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రోజు మరోసారి రిపోర్టులు పరిశీలించి సాయంత్రం సర్జరీ చేసేది లేనిది పరిశీలిస్తామని వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ కు అయిన గాయంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, చికిత్స పొందుతున్నట్లు, కాలికి అయింది స్పల్పగాయమే అని ట్వీట్ చేశారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరగా కోలుకుంటారని అన్నారు.

కెసిఆర్ కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Read More
Next Story