బల్దియాలో 27 మంది అధికారుల బదిలీ
x

బల్దియాలో 27 మంది అధికారుల బదిలీ

అవినీతి ఆరోపణలే కారణం


ఖాయే పీయే చల్ దియే అనేది హైద్రాబాద్ లో సర్వసాధారణంగా వినిపించే నానుడి. బల్దియా (GHMC) ఉద్యోగ సిబ్బందిని ఉద్దేశించి ఈ మాటను అంటుంటాం, దశాబ్దాల తరబడి బల్దియా ను ఉద్దేశించి కామన్ మ్యాన్ నుంచి వినిపించే మాట అది. దీనర్థం తిని తాగి వెళ్లిపోవడం. హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అటువంటి చెడ్డ పేరు మూట గట్టుకుంది.

పీక లోతు అవినీతిలో కూరుకున్న బల్దియా ఉద్యోగ సిబ్బంది మీద కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ గా ఉన్నారు. ఏకంగా 27 మంది అధికారులను ఆయన బదిలీ చేశారు. ఇందులో కొందరికి బదిలీ అవ్వగా మరికొందరికి పదోన్నతులు లభించాయి. వీరిలో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. లంచాలకు మరిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు బదిలీ అయ్యారు. సత్ ప్రవర్తన గల సెక్షన్ ఆఫీసర్లకు ప్రమోషన్ అభించింది. ఆర్వీ కర్ణన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది. బల్దియాలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాాదులపై అవినీతి అధికారులను ఆయన ట్రాన్స్ ఫర్ చేశారు. అవినీతి అధికారులను సామూహికంగా బదిలీ చేయడం ఇదే ప్రథమం.

ప్రజావాణిలోఈ అవినీతి అధికారుల పేర్లను స్వీకరించిన కమిషనర్ బదిలీ ఉత్తర్వులు జారి చేసి వార్తల్లోకెక్కారు.మెహం దీ పట్నం ఎసిపి గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. గాజుల రామారం ఎసిపిగా సుమిత్రకు పోస్టింగ్ ఇచ్చారు. అల్వాల్ ఏసీపీగా శ్రీనివాస్ రెడ్డికి పోస్టింగ్ లభించింది. కార్వాన్ నుంచి సికింద్రాబాద్ ఎసిపిగా పావనీ బదిలీ అయ్యారు. హయత్ నగర్ ఎసిపిగా విజయ లక్ష్మి బదిలీ అయ్యారు. హెడ్ ఆఫీస్ కు ఎసిపిగా నరేష్ కు పోస్టింగ్ లభించింది. సెక్షన్ ఆఫీసర్ నుంచి ఎసిపిగా సుధాకర్ కు పోస్టింగ్ లభించింది. ఆయనను చాంద్రాయణ గుట్టకు పోస్టింగ్ ఇచ్చారు. రమేష్ కుమార్ కు కూకట్ పల్లి ఎసిపి నుంచి గోషా మహల్ కు బదిలీ చేశారు. తాండూరు నుంచి శేర్ లింగం పల్లి జోనల్ కి లాలప్ప బదిలీ అయ్యారు. జీషన్ ను సెక్షన్ ఆఫీసర్ నుంచి ఎసిపిగా ప్రమోట్ చేస్తూ కూకట్ పల్లికి బదలీ చేశారు. భాను చందర్ ఎసీపీ చాంద్రాయణ గుట్ట నుంచి సంతోష్ నగర్ కు బదిలీ అయ్యారు. మంజులాసింగ్ గోషా మహల్ ఎసిపి నుంచి కులీ కుతుబ్ షా ఎసిపిగా బదిలీ అయ్యారు.ఎసిపి స్వామి సంతోష్ నగర్ నుంచి మెహందీ పట్నంకు బదీ అయ్యారు. పీ రమేష్ సెక్షన్ ఆఫీసర్ నుంచి కుత్బుల్లాపూర్ నుంచి చందానగర్ కు బదిలీ అయ్యారు. ఎండి అక్బర్ అహ్మద్ సెక్షన్ ఆఫీసర్ నుంచి హాయత్ నగర్ శేర్ లింగంపల్లికి బదిలీ అయ్యారు.

Read More
Next Story