ఐశ్వర్య రాయ్‌ పుట్టింటికి వెళ్ళిపోయారా?

ఐశ్వర్య రాయ్‌ అత్తగారి ఇంటి నుంచి బయటకు వచ్చారా?


ఐశ్వర్య రాయ్‌ పుట్టింటికి వెళ్ళిపోయారా?
x
ఐశ్వర్య రాయ్‌

ఐశ్వర్య రాయ్‌ అత్తగారి ఇంటి నుంచి బయటకు వచ్చారా? కొంతకాలంగా వస్తున్న వదంతులు నిజమయ్యాయా? ప్రస్తుతం వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్టే తెలుస్తోంది.

బాలీవుడ్‌లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్‌ల జంట ఒకటి. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జోడీ ప్రస్తుతం చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్‌ వచ్చాయి. విడిపోతున్నట్టు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు.
తాజాగా ఐశ్వర్య రాయ్‌ గురించి బాలీవుడ్‌ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో విభేదాలతో భరించలేక ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు జయా బచ్చన్‌తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం.
అభిషేక్‌ బచ్చన్‌తో పడడం లేదా?
ఇదే క్రమంలో భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పుట్టిన రోజు వేడుకల్లోనూ కనిపించని అభిషేక్‌
కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్‌ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్‌ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.


Next Story