తమిళనాడులో భారీ వర్షాలు.. పదిమంది మృతి
x
వరదల్లో చిక్కుకున్న తమిళనాడు

తమిళనాడులో భారీ వర్షాలు.. పదిమంది మృతి

గత రెండు రోజులుగా దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు


వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ బుధవారం పర్యటించనున్నారని తెలిసింది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఆయన గురువారం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన గురువారం మధురై చేరుకుంటారని వివరించింది.

తమకు అత్యవసరంగా రూ. 2 వేల కోట్లను నిధులను వరదసాయం కింద విడుదల చేయాలని సీఎం స్టాలిన్, ప్రధాని నరేంద్రమోడీని మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. అంతకుముందే సీఎం విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు వర్షాలు, వరదలల్లో చిక్కుకున్న విషయాన్ని ప్రధానికి వివరిస్తామని అన్నారు.

గడిచిన రెండు రోజుల్లో తిరునెల్వెలీ, తేన్ కాశీ, కన్యాకుమారీ జిల్లాలో అత్యధికంగా 1,192 మిల్లిలీటర్ల వర్షపాతం నమోదు అయింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే తిరు చెందూర్ లో 916 మిల్లీలీటర్ల వర్షం నమోదు అయింది. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం పరిశీలిస్తుందని, గురువారం ముఖ్యమంత్రి పర్యటిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సాయం ముమ్మరం చేశాయి. దక్షిణ రైల్వే ఇప్పటికే 19 రైళ్లను రద్దు చేసింది. ఇంకొన్ని రైళ్ళను దారి మళ్లించింది. శ్రీ వైకుంఠం రైల్వే స్టేషన్ భారీ వరదలు మంచెత్తాయి పలు రైళ్లలో చిక్కుకుపోయిన 809 మంది ప్రయాణికులను రక్షించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

మాకు సరైన సమాచారం లేదు

భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారం తమిళనాడు ప్రభుత్వానికి రాలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలకు, ఐఎండీ అందిస్తున్న వివరాలకు మధ్య పొంతనలేదని ఆయన ఆరోపించారు. తిరునల్వేలీ, ట్యూటీ కోరన్ జిల్లాలో గోడ కూలీ, విద్యుత్ దాఘాతంతో 10 మంది మరణించారని ఆయన సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

Read More
Next Story