ఈ వైఫల్యం ఎలా జరిగింది.. బాధ్యులెవరూ?
x
పార్లమెంట్ భవనం

ఈ వైఫల్యం ఎలా జరిగింది.. బాధ్యులెవరూ?

పార్లమెంట్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం చాలా కష్టతరమైన అంశం. 2001 డిసెంబర్ లో పార్లమెంట్ పై ఉగ్రవాద ఘటన తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు


అయినప్పటికీ నేటి ఘటన భద్రతా వైఫల్యాన్ని మరోసారి ఎత్తిచూపింది. ప్రస్తుతం పార్లమెంట్ లో అడుగుపెట్టాలంటే మూడు అంచెల తనిఖీ ఉంటుంది. కనీసం పెన్నునూ కూడా లోపలికి అనుమంతించరు. అలాంటి సెక్యూరిటీని తప్పించుకుని స్మోక్ క్యాన్లను ఎలా లోపలికి ఎలా వెళ్లారనేది పెద్ద ప్రశ్న. పార్లమెంట్ లో మొదట ఆధార్ కార్డు తీసుకుని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా మాత్రమే ప్రవేశం ఉంటుంది.

లోపలికి ప్రవేశించే సమయంలో మీడియాకు తప్ప ఎవరికి సెల్ ఫోన్ అనుమతించరు. తరువాత మనకు జారీ చేసిన పాస్ బార్ కోడ్, ఫోటో ను తీసుకుని గేటు ముందు ఉన్న స్కానర్ కి చూపితే లోపలకు అనుమతి ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ప్రాసెస్ ను ఆగంతకులు ఎలా తప్పించుకున్నారు.షూ లను తనిఖీ చేయరు అనే విషయాన్ని నిందితులను ఎవరు అందించారు అనేది పెద్ద మిస్టరీగా ఉంది.

ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరు కర్నాటకు చెందిన వారు కాగా మరొకరు మహరాష్ట్ర, ఇంకొకరు హర్యానాలోని హిస్సార్ వాసిగా గుర్తించారు. కర్నాటక వాసులకు మైసూర్ ఎంపీ ప్రశాంత్ సిఫార్సు మేరకు సభలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ పోలీస్ విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ఫోరెన్సిక్ నిఫుణులు పార్లమెంట్ ప్రాంగణంలోని పలు శాంపిల్లను సేకరించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ సైతం పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

దర్యాప్తు బాధ్యత నాదే: స్పీకర్ ఓం బిర్లా

లోక్ సభలో ఇద్దరు దుండగులు ప్రవేశించడం పై తిరిగి సభ సమావేశం అనంతరం స్పీకర్ మాట్లాడారు. దీనిపై సమగ్ర దర్యాప్తును ఆదేశించినట్లు చెప్పారు. ‘నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగ మాత్రమే అని తేలింది. అయితే దీనిని సాధారణంగా తీసుకోము. విచారణ చేపడతామని’ ఆయన సభకు హమీ ఇచ్చారు.

ఈ అంశంపై మాట్లాడాలని కొంతమంది సభ్యులు డిమాండ్ చేయగా వారిని స్పీకర్ సముదాయించారు. ఎంతటి వ్యతిరేక పరిస్థితి ఎదురైన సభను ఆపలేరనే సందేశం ఇవ్వడానికి సభను సజావుగా నిర్వహించడానికి సహకరించాలని సభ్యులను స్పీకర్ కోరారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ విజిటర్స్ పాస్ లను అనుమతించమని స్పీకర్ ప్రకటించారు.

Read More
Next Story