పెద్దాయన ఆరోగ్యం ఎలా ఉంది.. సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్ లో రాత్రి బాత్రూంలో కేసీఆర్ కాలుజారిపడిన సంగతి విదితమే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహూటిన హైదరాబాద్ లో గల సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ లో ఎడమకాలు తుంటి ఎముకకు పగుళ్లు వచ్చాయని తెలిసింది. సాయంత్రం కేసీఆర్ కు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరోగ్య పరిస్థితిని తనకు అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు.