అపరిచితుల నుంచి వీడియో కాల్స్ వస్తే...తస్మాత్ జాగ్రత్త!
x

అపరిచితుల నుంచి వీడియో కాల్స్ వస్తే...తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణలో సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. రోజుకో రకం మోసం వెలుగుచూస్తున్న నేపథ్యంలోప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు తాజాగా హెచ్చరిక జారీ చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సైబర్ మోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా అపరిచితులు వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు ఎక్స్ పోస్టు ద్వారా హెచ్చరించారు.


ఫ్రాడ్ వీడియో కాల్స్ పట్ల జాగ్రత్త
‘‘ఎవరైనా అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఆ వీడియో కాల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో లిఫ్ట్ చేయద్దు! ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లు న్యూడ్ లో ఉండి రికార్డ్ చేస్తారు. ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసిస్తారు. తస్మాత్ జాగ్రత్త!!’’అని పోలీసులు ఎక్స్ పోస్టులో ప్రజలను హెచ్చరించారు.

సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిల్

సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారి ఫోటోను డీపీగా పెట్టుకుని వీడియో కాల్ చేసి ‘మీ కుమారుడు తన స్నేహితులతో కలిసి ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని జైల్లో వేశాం.’ అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్ర డీజీపీ ప్రజలకుసూచనలు చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే 1930 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలనని కోరారు.

పోలీసు అధికారి పేరిట ఫేక్ కాల్స్
పోలీసు అధికారి పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్లు ఉన్నారు... ప్రజలు అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలను కోరారు.

పెరుగుతున్న సైబర్ నేరాలు

తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 2019వ సంవత్సరంలో తెలంగాణలో 2,691 సైబర్ నేరాలు జరిగాయి. 2020లో వీటి సంఖ్య 5,024కు పెరిగాయి. 2021లో 10,303 కేసులు నమోదయ్యాయి. దేశంలో 20 శాతం సైబర్ నేరాలు తెలంగాణ రాస్ట్రంలోనే జరిగాయని ఎన్ సీఆర్ బీ నివేదికలు వెల్లడించాయి.

తెలంగాణ సైబర్ పోలీసుల రికార్డు

తెలంగాణలో సైబర్ నేరాలు పెరగడంతో అప్రమత్తమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తమైంది. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు రూ.85.05 కోట్ల ను రిఫండ్ చేయడంలో పోలీసులు కీలక పాత్ర వహించారు. సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా పోలీసులు కేసులు నమోదు చేశారు.


Read More
Next Story