రామమందిర ప్రారంభోత్సవం, తొమ్మిది ముఖ్యాంశాలు
x
నిర్మాణంలో ఉన్న రామమందిరం

రామమందిర ప్రారంభోత్సవం, తొమ్మిది ముఖ్యాంశాలు

అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం వచ్చే నెల 22 న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ వేడుక కోసం రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అంగరంగవైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.


ఇప్పటికే దేశంలోని ముఖ్యులకు తీర్థట్రస్ట్ ఆహ్వనాలు అందజేసింది. దేశంలోని హిందూ సంస్థలు ఆలయ ప్రారంభోత్సవాన్ని స్వాతంత్య దినోత్సవంగా, పాకిస్తాన్ సైన్యాన్ని బంగ్లా యుద్దం సందర్భంగా నిర్భంధించిన రోజుగా, కార్గిల్ విజయ్ దివస్ గా, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరుపుకున్న విజయోత్సవంగా పరిగణిస్తూ సంబరాలు చేయాలని అనుకుంటున్నారు. రామమందిర నిర్మాణం అనే దేశం మొత్తాన్ని ఏకంగా చేసే మాధ్యమంగా పలు హిందూ సంస్థలు భావిస్తున్నాయి. సమకాలీన భారత చరిత్రలో ఒక ఆలయ నిర్మాణం ఇంతలా ఎప్పుడు చర్చ జరుగలేదు.





మందిరం ప్రారంభం సందర్భంగా జరిగే ముఖ్యాంశాలు

1. రామపూజకు ఎంపిక అయిన అర్చకులు డిసెంబర్ 26 నే అయోధ్యకు చేరుకుని పూజ సన్నాహాల్లో పాల్గొంటారు.

2.జనవరి 16న సరయూ నదికి, రాముడు నగర్ భ్రమన్ కు జలయాత్రతో ఆచారాలు ప్రారంభం అవుతాయి. రామ్ లల్లా దివ్యమూర్తిని ఓపెన్ టాప్ వాహనంపై అయోధ్యలో ఊరేగింపు నిర్వహిస్తారు.

3. జనవరి 17న గణేష్ పూజ కార్యక్రమం జరగనుంది. తొలిపూజ గణేషుడికి నిర్వహించడం ఆనవాయితీ.

4. జనవరి 22 న ఉదయం ప్రధాని నరేంద్రమోదీ రామ్ లల్లా దివ్యమూర్తి ప్రాణ ప్రతిష్టకు హజరవుతారు.

5. వారణాసికి చెందిన 121 మంది అర్చకులు కీర్తనతో రామచంద్ర ప్రభువుకు తొలి హారతి ఇస్తారు. ఈ అర్చకులను కంచి కామకోటీ పీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి ఎంపిక చేశారు.

6. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 సెకన్ల నుంచి 12:30:32 మధ్య పవిత్రమైన 84 సెకన్ల కాలంలో ప్రధాని తొలి పూజ చేస్తారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. రాముడి విగ్రహానికి మొదటి హారతి ఇచ్చే ప్రధాని మంత్రియే.

7. పూజకు ఉపయోగించే ద్రవ్యాలన్నీ కాశీ నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా తీసుకురానున్నారు.

8. రాముడు జన్మించిన సమయాన్ని, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఉత్తమమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 22 తేదీన ఉన్న ముహూర్తాన్ని ఆలయ పండితులు నిర్ణయించినట్లు తీర్ధ ట్రస్ట్ వెల్లడించింది.

9. వారణాశికి చెందిన గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే జ్యోతిష్కుడు విగ్రహ ప్రాణి ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు.





కాగా ఆలయ వేడుకలు దేశ వ్యాప్తంగా ఉన్న అతిరథమహరథులకు రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ ఆహ్వనాలు పంపింది. ఇందులో పలువురు ప్రతిపక్ష నాయకులు సైతం ఉన్నారు. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవేగౌడ, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆమ్ఆద్మీ పార్టీ నేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులున్నారు. సినిమా నటులకు సంబంధించి రజనీకాంత్, అమితాబ్, మాధురీ దీక్షిత్, నితిష్ భరద్వాజ్, డైరెక్టర్ మధుర్ భండార్కర్ వంటి వారికి ఆహ్వానం వెళ్లింది. అయితే అయోధ్య రామాయల ఉద్యమానికి బాట వేసిన మాజీ ఉప ప్రధాని లాల్ కిషన్ అద్వానీకి, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం లేదు.

Read More
Next Story