ఉగ్రవాదంపై భారత విధానం 2014 తరువాతనే మారింది
x

ఉగ్రవాదంపై భారత విధానం 2014 తరువాతనే మారింది

ఉగ్రవాదంపై భారత విధానం మోదీ వచ్చాకనే మారిందని విదేశాంగవిధానం మారిందని అన్నారు. ముంబై అటాక్ తరువాత ఒక్కరూ కూడా ప్రతిదాడి గురించి ఆలోచించలేదని చెప్పారు.


2014 నుంచి దేశ విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సరైన విధానం ఇదేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జైశంకర్ ఇక్కడ 'వై భారత్ మ్యాటర్స్: ఆపర్చునిటీ ఫర్ యూత్ అండ్ పాటిసిపేషన్ ఇన్ గ్లోబల్ సినారియో' అనే పేరుతో జరిగిన కార్యక్రమంలో దేశ యువతతో సంభాషించారు.

ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం భారత్‌కు కష్టంగా ఉంది అనే ప్రశ్నకు, పాకిస్థాన్ మన పొరుగు దేశమని, ఇక్కడ మనం మాత్రమే బాధ్యతయుతంగా ఉన్నామని అన్నారు. 1947లో, పాకిస్తాన్ సైన్యానికి గిరిజనులు వేషం వేసి జమ్మూకాశ్మీర్ దురాక్రమణకు పూనుకుందని వారిని భారత సైన్యం ఎదుర్కొందని అన్నారు.
“భారత సైన్యం యుద్ధం చేస్తుండగానే మనం వెళ్లి దీన్ని ఐరాసకు నివేదించాం. ఇక్కడ ఉగ్రవాదులకు బదులుగా గిరిజన ఆక్రమణ దారులనే పదం వాడాం. మనకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఏం చేయలేక పోయాం. తరువాత ఉగ్రవాద బాధిత దేశంగా మారిపోయాం. అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు భిన్నమైన విధానం అనుసరిస్తున్నాం" అని అన్నారు. ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించమని ఆయ‌న తేల్చిచెప్పారు.
దేశ విదేశాంగ విధానం కొనసాగింపుగా సాగుతుందా అనే ప్రశ్నకు జై శంకర్ సమాధానం ఇస్తూ.. అవును అన్నారు. 50 శాతం పాత విధానంలో కొనసాగుతోందని, మరో 50 శాతం కొత్త విధానంలో ఉందని అన్నారు. విదేశాంగ విధానంలో ప్రధాన మార్పు ఉగ్రవాదంపై తీసుకున్నామని చెప్పారు. 2008 లో ముంబై పై దాడి చేసినప్పుడు ఒక్కరు కూడా ప్రతిదాడి గురించి ఆలోచించలేదు. మరోసారి దాడి జరిగితే మన వద్ద నుంచి వచ్చే సమాధానం ఏంటీ అని ప్రశ్నించారు. పాకిస్తాన్ పై దాడి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో.. చేయకుండా ఉంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు.
"టెర్రరిస్టులు సరిహద్దుకు ఆవల ఉన్నందున వారిని ఎవరూ తాకలేరు. ఉగ్రవాదులు ఎటువంటి నియమాలు పాటించరు. వారికి చెప్పే సమాధానంలో కూడా ఎటువంటి నియమాలు ఉండవు " అని ఆయన అన్నారు.
Read More
Next Story