ఆంధ్రాలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవనేనా?
x

ఆంధ్రాలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవనేనా?

ఏపీలో కూటమికి అనుకూలంగా వీస్తున్న గాలి తాకిడికి వైసీపీ ఫ్యాన్ రెక్కలు తునాతునకలయ్యాయి. 2019లో 151 స్థానాలతో విజయదుందుభిని మోగించిన వైసీపీ 20-30 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.



-డీ ఎస్ శ్రావణ బాబు, సీనియర్ జర్నలిస్ట్

ఏపీలో కూటమికి అనుకూలంగా వీస్తున్న గాలి తాకిడికి వైసీపీ ఫ్యాన్ రెక్కలు తునాతునకలయ్యాయి. 2019లో 151 స్థానాలతో విజయదుందుభిని మోగించిన వైసీపీ 20-30 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఈ ఫలితాలను ఊహించగలమా? వైసీపీ ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చుగాక, కానీ ఆ పార్టీకి రాష్ట్రంలో చెక్కుచెదరని బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటి పార్టీతో పోటీ పడాలంటే తెలుగుదేశం ఒక్కదానితో సాధ్యమయ్యేది కాదనేది ఎవ్వరూ కాదనలేరు. ఈ ఫలితాలకు, ఈ ప్రభంజనానికి ఏకైక కారణం తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేయటం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోను అంటూ, పొత్తుకు రూపకర్తగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీల్ లైఫ్‍‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకని పొలిటికల్ హీరోగా అవతరించారు.

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబునాయుడును పవన్ కళ్యాణ్ కలిసి బయటకు వచ్చి పొత్తు ప్రకటించటంతోనే కూటమి విజయానికి పునాదులు పడ్డాయి. ఆ ఊపును కొనసాగించటానికి అనేక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినాకూడా తాను ఎన్నో మెట్లు దిగటమే కాకుండా, పొత్తుకు అనుకూలంగా లేని బీజేపీ అగ్రనేతలను ఒప్పించటం వలనే ఇవాళ కూటమికి దక్కిన ఫలితాలు సాధ్యమయ్యాయి. వాస్తవానికి తమకు 40 స్థానాలలో బలం ఉందని తనే పలు బహిరంగ వేదికలపై చెప్పి, పొత్తు తర్వాత 24 స్థానాలకు, చివరికి 21 స్థానాలకు తగ్గటంపై పవన్‌పై అనేక విమర్శలు, వెటకారాలు వ్యక్తమయినా అతను బలంగా ఒకటే స్టాండ్‌పై నిలబడ్డాడు. అతను 2014 నుంచి తన రాజకీయ జీవితంలో చేసిన అనేక తప్పులు ఈ ఒక్క పాజిటివ్ నిర్ణయంతో మాఫీ అయిపోయి, ఏపీ రాజకీయ యవనికపై అతను ఒక కొత్త హీరోగా అవతరించాడనటంలో ఎలాంటి సందేహంలేదు. అయితే కేవలం పుస్తక పరిజ్ఞానంతో యుటోపియన్ ప్రపంచంలో, ఆదర్శాల మధ్య జీవించే పవన్ ప్రాక్టికల్ పొలిటికల్ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలడో చూడాలి. తప్పనిసరిగా జనసేనకు, తెలుగుదేశానికి మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఏర్పడే అవకాశం ఉంది.

జగన్‌కు ముందుముందు ముసళ్ళపండగే!

కేంద్రంలో ఎన్డీఏ కూటమికి గణనీయమైన మెజారిటీ రాకపోవటంతో బీజేపీకి తప్పనిసరిగా టీడీపీ, జనసేనల అవసరం బాగా ఉంటుంది. ఈ నేపథ్యలో జగన్మోహన్ రెడ్డికి ముందుముందు గడ్డుపరిస్థితిలాగానే కనిపిస్తోంది.

Read More
Next Story