తిరుమలలో ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూ ప్రసాదం..!
x

తిరుమలలో ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూ ప్రసాదం..!



తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై భక్తులు ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి తెచ్చింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. దర్శనం టికెట్‌పై ఒక లడ్డు, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డును భక్తులకు అందించనున్నారు. అయితే, టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు. మరోవైపు, లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను మళ్లీ ప్రారంభించింది. నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను టీటీడీకి మళ్లీ ప్రారంభించగా. బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గతేడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు.

"టీటీడీలో లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ బాట వేస్తుంది: కందారపు మురళి




తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి అమలు చేయాలని భావిస్తున్న లడ్డూల రేషన్ విధానం చివరకు బ్లాక్ మార్కెటింగ్ కి దోహదపడుతుందని టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదని భక్తుల మనోభావాలకు భిన్నమైందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ అంశాన్ని తాము తెలియజేస్తున్నామని గతంలో కూడా ఈ రేషన్ విధానం కారణంగా విపరీతమైన బ్లాక్ మార్కెటింగ్ ఏర్పడిన విషయాన్ని యాజమాన్యం మరిచిపోయినట్టుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తిరుమల కొండపై దళారుల దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో క్యాబినెట్ సమావేశంలో ఓ మహిళా మంత్రి ముఖ్యమంత్రికి స్వయంగా ఫిర్యాదు చేసినా ఆ దందాకి బలం చేకూర్చేటట్టుగా టీటీడీ యాజమాన్యం ప్రకటనలు చేయటం ఏ రకంగాను సమంజసం కాదని తక్షణం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.




Read More
Next Story