ఆర్జీవీ వ్యూహానికి లోకేశ్‌ బ్రేక్‌
x
విజయవాడ ఇండోర్ స్టేడియంను పరిశీలిస్తున్న రామ్‌గోపాల్‌ వర్మ

ఆర్జీవీ 'వ్యూహానికి' లోకేశ్‌ బ్రేక్‌

విజయవాడలో ప్రివ్యూ విడుదల చేసేందుకు అటు రామగోపాల వర్మ వెళ్లాడో లేదో ఇక్కడ నారా లోకేశ్‌ హైదరాబాద్‌ సివిల్‌ కోర్టులో కేసు వేశాడు


రామ్ గోపాల్ వర్మ.. సంచల దర్శకుడు, నిర్మాత. సమయానికి తగ్గ సినిమాలు తీయడంలో దిట్ట. అది రాజకీయమైనా, బయో పిక్‌ అయినా.. గెలుపోటములతో నిమిత్తం లేదు. హిట్‌ అయినా ఫట్‌ అయినా లెక్కపెట్టడు. తెలుగు రాష్ట్రాల్లోని సంచలన సంఘటనలన్నింటిపైనా ఆయన సినిమాలు తీశారు. ఇప్పుడు అదే కోవలో వైసీపీ అధినేత జగన్‌పై వ్యూహం అనే సినిమా తీశాడు. దీనికేమో లోకేశ్‌ బ్రేక్‌ వేశాడు.

లోకేశ్ కేసు ఎందుకు వేశాడంటే...

విజయవాడలో ప్రివ్యూ విడుదల చేసేందుకు అటు రామగోపాల వర్మ వెళ్లాడో లేదో ఇక్కడ నారా లోకేశ్‌ హైదరాబాద్‌ సివిల్‌ కోర్టులో కేసు వేశాడు. విడుదల కాకుండా ఉత్తర్వులు తెచ్చారు. వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటీటీ, ఇంటర్నెట్‌, థియేటర్‌ సహా ఏ ఇతర వేదికల్లోనూ విడుదల చేయొద్దని సివిల్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాలో పిటిషనర్‌ కుటుంబసభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని లోకేశ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.

సెన్సార్‌ సర్టిఫికెట్‌పై 26న హైకోర్టులో పిటిషన్‌...

వ్యూహం సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 26న విచారణకు స్వీకరించనుంది తెలంగాణ హైకోర్టు . సినిమాకు సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నది నారా లోకేశ్‌ వాదన. ఏమి జరుగుతుందో మరో వారం ఆగాల్సిందే

Read More
Next Story