సీఎం రేసులో నేను కూడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
x
ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం రేసులో నేను కూడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న అనుభవం ఉందని, అంతకుముందు భారత సైన్యంలో పని చేశానని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన శక్తి మేరకు పార్టీ ని బలోపేతం చేశానని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచాను, గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నానని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాంటి నేను సీఎం రేసులో ఎందుకు ఉండకూడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు లేదా ఐదుగురు సీఎంగా కావడానికి పోటీగా ఉన్నారని, అలాగే ఉంటారని చెప్పారు. డీకే శివకుమార్ ను కలిసి తన అభిప్రాయాలను చెప్పానని మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి కనీసం 48 గంటలు కూడా కాలేదని పేర్కొన్నారు.

తాను మిగతా కాంగ్రెస్ వాదులు కూడా హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో ఎలాంటి గందరగోళం లేదని, తాము చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని వివరించారు. సీఎం పదవిని ఆశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయి తమను ఎందుకు సీఎం చేయాలనే విషయంపై తమతమ వాదనలను బలంగా వినిపించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ మాత్రం పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపించినట్లు సమాచారం. సాయంత్రం కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ తదుపరి సీఎం అనే అంశంపై చర్చించినట్లు సమాచారం.

Read More
Next Story