మూడు చింతలపల్లి మండలంలో కొత్త రాతి చిత్రాల తావు
x
తెలంగాణలో కనిపించిన రాతి చిత్రాలు

మూడు చింతలపల్లి మండలంలో కొత్త రాతి చిత్రాల తావు

ఎత్తైన దిబ్బమీదున్న రాతిగుహ ప్రవేశంలోనే కప్పుబండ కిందివైపు ఎరుపురంగులో వేసిన రాతిచిత్రాలు కనిపించాయి



తెలంగాణలోని ఒక గ్రామ సమీపాన 40కి పైగా రాతిచిత్రాల తావులు గుర్తించిన చరిత్రబృందం ఖాతాలో లింగాపూర్ చిత్రిత శిలాశ్రయం

కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు (కింది ఫోటో) అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, ఎం.డి. అన్వర్, కొరివి గోపాల్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని లింగాపూర్(నిర్జనగ్రామం చినపర్వతాపూర్ ప్రాంతం)లో కొత్తగా వెంచర్లు చేస్తున్న భూమిలో ఒక చోట 17.636054 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.71662డిగ్రీల తూర్పు రేఖాంశంపై, సముద్రమట్టానికి 544మీ.లఎత్తులో 10అడుగుల ఎత్తైన దిబ్బమీదున్న రాతిగుహ ప్రవేశంలోనే కప్పుబండ కిందివైపు ఎరుపురంగులో వేసిన రాతిచిత్రాలను గుర్తించారు.


వాటిలో వాతావరణప్రభావంచేత వెలిసిపోయిన చిత్రాలున్నాయి. జననాంగంతో మూపురపుటెద్దు, ఒక మనిషి చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చరిత్రబృందం కన్వీనర్, కో-కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, జమ్మనపల్లి రమేశ్- చరిత్ర బృంద సభ్యులతో కలిసి ఈ రాతిచిత్రాలతావును పరిశీలించారు. గతంలో పూర్వ వారసత్వశాఖ డైరెక్టర్ వివి కృష్ణశాస్త్రి చెప్పిన వివరణల ఆధారంగా ఈ రాతిచిత్రాలు కాంస్యయుగానికి(కొత్తరాతియుగం) చెందినవిగా నిర్ధారించారు. దాదాపుగా ప్రస్తుతానికి 5వేల సంవత్సరాల కిందటి ఈ రాతిచిత్రాలు ఈ ప్రాంతంలో మా చరిత్రబృందం గుర్తించిన కాసీపేట, ప్యారారం రాతిచిత్రాలతో పోలివున్నాయి. సమృద్ధంగా లభిస్తున్న రాతిచిత్రాలతో బొమ్మల రామారం పరిసర మండలాలు నిజంగా బొమ్మలతావులుగా ప్రసిద్ధమవుతున్నాయి.

క్షేత్రపరిశోధకులు: అహోబిలం కరుణాకర్, ఎండి.నసీర్, అన్వర్, కొరివి గోపాల్

చారిత్రక పరిశీలన: శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, కొత్త తెలంగాణ చరిత్రబృందం

Read More
Next Story