'ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు TSPSC చైర్మన్ ఫోస్టు ఆఫర్ చేశా'
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఎస్ పి మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గురించి ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు. అవేంటంటే...
బహుజన్ సమాజ్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆయన కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెయిర్మన పదవి ఆఫర్ చేశానని ఆయన వెల్లడించారు.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
"అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఐపిఎస్ అధికారిగా ఉద్యోగంలో కొనసాగి ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రవీణ్ కు ఆఫర్ చేశా.. కానీ ఆయన ఒప్పుకోలేదు," రేవంత్ చెప్పారు.
ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరతారన్న విషయం ప్రస్తావిస్తూ, ఆయన కేసీఆర్ తో చేరుతారని తాను భావించడం లేదని, ఒక వేళ కేసీఆర్ తో చేరితే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనేనని రేవంత్ రెడ్డి అన్నారు.
నిజాం కోరిక
‘‘సెప్టెంబరు 17,1948 సెప్టెంబర్ 17లో దేశంలో ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్ర నిజాం రాచరిక పాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. సాయుధ రైతాంగ పోరాటంతో 2023 డిసెంబర్ 3కు అంతే ప్రాధాన్యం ఉంది. నిజాం ఆసుపత్రి, నిజాంసాగర్ కట్టినా, ఉస్మానియా యూనివర్శిటీ ఏర్పాటు చేసినా,నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రి కట్టినా, మొజాంజాహీ మార్కెట్ కట్టినా, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు చేసినా 8 వతరం తమ వారసులే పాలన సాగించాలని ఏడవ నిజాం ఆశించారు. మా రాచరికంలో మీకు స్వేచ్ఛ లేదని నిజాం ప్రభువులు ప్రకటించారు. కాని ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛ కోసం అరాచకం నుంచి విముక్తి పొందేందుకు సాయుధ పోరాటం జరిగింది. నాడు ఎర్రజెండా నీడన ఈ ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశత్వం నుంచి స్వేచ్ఛను ప్రసాదించారు.’’ అని సీఎం చెప్పారు.