రయ్...రయ్ న...మహిళాలోకం, మహాలక్ష్మి ప్రారంభం
x
మహాలక్ష్మి ప్రారంభం

రయ్...రయ్ న...మహిళాలోకం, మహాలక్ష్మి ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన మహలక్ష్మీ పథకం, ఆరోగ్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు.


ఇక నుంచి తెలంగాణ పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సీటి బస్సు, సిటీ మెట్రో సర్వీసులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వాళ్లతో పాటు ట్రాన్స్ జెండర్ లు సైతం ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం సభ ప్రాంగణంలోనే పథకాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో మంత్రులు, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే, బాక్సర్ నిఖత్ జరీన్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ సీఎస్ శాంతి కుమారీ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9 నే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ఈ రోజు తెలంగాణకు నిజమైన పండగ రోజని, నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం సోనియాగాంధీ కలిగించారని అన్నారు. సెప్టెంబర్ 17, 2023న ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ ప్రకటించారని, వాటిని వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజు రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. మొదట మంత్రులతో ఆర్టీసీ బస్సులో ట్యాంక్ బండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వరకూ వెళ్లి తిరిగి వస్తామని అన్నారు.

నిఖత్ జరీన్ కు రెండు కోట్ల ఆర్ధిక సాయం

తెలంగాణకు బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ ప్రభుత్వం తరఫును రెండు కోట్లు సాయం అందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బాక్సర్ కు రెండు కోట్ల చెక్కును అందించారు.

Read More
Next Story