ప్రగతి భవన్ ముందున్న బారిగేట్ల తొలగింపు
x
pragathi bhavan

ప్రగతి భవన్ ముందున్న బారిగేట్ల తొలగింపు


గత ప్రభుత్వ సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ పేరును ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్ గా మార్చుతున్నట్లు ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో వాటిని తొలగించాలని ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. అసెంబ్లీ ఫలితాల్లో ఓటమి ఖరారు కాగానే కేసీఆర్ తన రాజీనామాను గవర్నర్ కు పంపించి తన ప్రగతి భవన్ ను ఖాళీ చేసి స్వంత కార్లతో ఎర్రవెల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు.

ఈరోజు ఎల్బీ స్డేడియంలో జరిగే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో సీఎంగా గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తరువాత 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఇప్పటికే పలువురు అభినందనలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి డీకే స్థాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో రేవంత్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు వెళ్లి ఘన స్వాగతం పలికారు.

Read More
Next Story