ఓయూకు వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రభుత్వం
x

ఓయూకు వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రభుత్వం

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులను మంజూరు.


తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక జీఓను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ జీఓ పలు చర్చలకు దారితీస్తోంది. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు నెలలో ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు మూడు సందర్భాల్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై మాట్లాడారు. కానీ ఇప్పుడు డిసెంబర్ నెలలో రూ.1000 కోట్ల నిధులను యూనివర్సిటీకి మంజూరు చేస్తున్నట్లు జీఓను విడుదల చేయడం కీలకంగా మారింది. బుధవారం రేవంత్ రెడ్డి.. యూనివర్సిటీకి వెళ్లారు. ఆ సందర్భంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జీఓను డిసెంబర్ 9 డేట్‌తో ఓకే చేయగా, దానిని డిసెంబర్ 10న అంటే బుధవారం ప్రకటించారు.

కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని!

ఆగస్టు నెలలో యూనివర్సిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని, ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఆనాటి నుంచి ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా అదే విధంగా ఎటువంటి చర్య తీసుకోకుండా బుధవారం.. యూనివర్సిటీ పర్యటనకు వెళ్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భావించే.. డిసెంబర్ 9న నిధులు మంజూు చేస్తున్నట్లు జీవోను విడుదల చేసినట్లు చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో నిధులు, నియామకాలు నినాదంతో చేసిన కేసీఆర్.. అవేమీ ఓయూకు మంజూరు చేయలేదు. అంతేకాకుండా గ్రూప్ పరీక్షలు సహా పలు విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో మండిపోయారు.

2017లో ఒక కార్యక్రమం కోసం కేసీఆర్.. ఓయూకు వెళ్లిన సమయంలో ఆయన హెలికాప్టర్‌ ల్యాండ్ కాకుండా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా విద్యార్థులు.. వెనకడుగు వేయకుండా కేసీఆర్‌ను అడ్డుకున్నారు. అంతేకాకుండా హెలికాప్టర్‌పైకి చెప్పులు, బూట్లను కూడా విసిరిన అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కాగా ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకోకుండా వెళ్తే తమ ప్రభుత్వం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భావించే రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంగళవారం జీఓను సిద్ధం చేసి.. బుధవారం విడుదల చేసి ఉంటారని విశ్లేషులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story