తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. వివరాలు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలను అమలు చేయడానికి టీపీసీసీ అధ్యక్షుడిని సీఎల్పీ నేతగా చేయడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ నెల 7న సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీనితో 2014 లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రి అవుతారు. గత రెండు పర్యాయాలు బిఆర్ ఎస్ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే లతో సమావేశం జరిగింది. ఇక్కడ హైదరాబాదు లోజరిగిన సిఎల్ పి సమావేశంలోని చేసిన తీర్మానాలను పరిశీలించారు.
సమావేశానికి డీకే శివకుమార్, మాణిక్ ఠాక్రే ఇచ్చిన వివరాలు, అలాగే సీఎల్పీ తీర్మానాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తరువాత సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశామని ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు.
మిగిలిన అన్ని విషయాలను స్థానిక నాయకత్వం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి అయిన కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎంగా కావడానికంటే ముందు కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు దాదాపు 40 నిమిషాలు సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ కూర్పు పై చర్చించారు.
ఢిల్లీ బయల్దేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు హుటాహూటిన రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గత రెండు రోజులుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా లోనే ఉంటున్న రేవంత్ రెడ్డి వెంటన ఢిల్లీ బయల్దేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి వర్గ కూర్పుపై చర్చిచేందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఈ రాత్రి కి లేదా రేపు క్యాబినెట్ మంత్రలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల పేర్లను ఖరారుచేస్తారని తెలిసింది.