సీఎంగా తొలి ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
x
సీఎం రేవంత్ రెడ్డి

సీఎంగా తొలి ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్( ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని, ఇక నుంచి తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం చేస్తానని, రాష్ట్రం మొత్తం సమాన అభివృద్ధి తో ఉజ్వలంగా వెలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విరుచుకుంటాయని అన్నారు. ఇదీ మీ అన్న ఇస్తున్నమాట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అంతకుముందు ఎల్బీ స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అతిరథ మహరథులు హజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 1.22 నిమిషాలను ప్రమాణ స్వీకారం ప్రారంభం అయింది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణం అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ప్రజా పాలన తిరిగి తెస్తామని ప్రకటించారు. పదేండ్ల చీడపోయిందని అన్నారు. ప్రగతి భవన్ పేరును మహత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ పేరుగా మారుస్తున్నట్లు, రేపు ఉదయం పది గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అశేష జనవాహిని మధ్య ప్రకటించారు.

Read More
Next Story