Food Safety |శ్రీ చైతన్యపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల కొరడా,లైసెన్స్ రద్దు
x
అపరిశుభ్రంగా ఉన్న శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ (ఫొటో : ఫుడ్ సేఫ్టీ అధికారుల సౌజన్యంతో)

Food Safety |శ్రీ చైతన్యపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల కొరడా,లైసెన్స్ రద్దు

హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఘళిపించారు.బొద్దింకలతో అపరిశుభ్రంగా ఉన్న చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్సును రద్దు చేశారు.


హైదరాబాద్ నగరంలో హోటళ్లలోనే కాకుండా విద్యాసంస్థల కిచెన్ లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 24వతేదీన మాదాపూర్ లోని శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ అపరిశుభ్రంగా బొద్దింకలతో ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది.

- కాలం చెల్లి, పాడై పోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలతో వంట చేస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది.
- మాదాపూర్ ఖానామెట్ ప్రాంతంలో మెస్సర్స్ శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ కిచెన్ లో నీటి విశ్లేషణ నివేదికలు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కిచెన్ తోపాటు రిఫ్రిజిరేటరు అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. కిచెన్ ఫ్లోరింగ్ అపరిశుభ్రంగా ఉంది. వంటగదిలో డ్రైనేజీ సరిగా లేదని తనిఖీల్లో తేల్చారు.
- ఎగ్జాస్ట్ ఫ్యాన్ వద్ద, వంటగది అపరిశుభ్రంగా కనిపించింది. చెత్తబుట్టలు తెరిచే ఉన్నాయి.ఆహార పదార్థాలు నేలపైనే నిల్వ చేయడం కనిపించింది. వంటగదిలో బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. ఎలుకల మలం కూడా కనిపించింది.వంట చేసే వారు అఫ్రాన్లు, చేతి తొడుగులు ధరించలేదు.
- అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని, ఫుడ్ సేఫ్టీ అధికారులు చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్సును రద్దు చేశారు.


Read More
Next Story