కాళేశ్వరం అక్రమాలపై కఠినచర్యలు : మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ నష్టంపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై జ్యుడీషియల్ ప్యానెల్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జుడిషీయల్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వద్ద జరిగిన నష్టంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు.
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన మధ్యంతర చర్యల ప్రకారం బ్యారేజీల పనుల పురోగతిని శుక్రవారం మంత్రి సమీక్షించారు. గతంలో విజిలెన్స్ విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.రెండు మూడు బ్యారేజీల్లో లీకేజీలు రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
బ్యారేజీల పరిరక్షణకు మధ్యంతర చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రాజెక్టును సందర్శించిన ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ బ్యారేజీల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై కొన్ని మధ్యంతర చర్యలను సూచించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాలని,వర్షాకాలంలో వరద రక్షణ పనులు చేపట్టాలని ప్యానెల్ సూచించినట్లు ఆయన తెలిపారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులతో మరమ్మతు పనులు
రాష్ట్ర ప్రభుత్వం నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి పంపింగ్ చేపట్టాలని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావిస్తూ.. నీటిని నిల్వ చేయవద్దని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా సూచించిందని అన్నారు. ఎన్‌డిఎస్‌ఎ సూచించిన మధ్యంతర చర్యలకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని మంత్రి చెప్పారు.
Next Story