తెలంగాణ ముఖ్యమంత్రి.. ఆంధ్రా వియ్యంకుడు..
రాష్ట్రం విడిపోయినంత మాత్రాన బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు, అనురాగాలు పోతాయా! హద్దులు భూమికే గాని మనసులకు కాదు గదా. అందుకే భీమవరంలో అంత సందడి.
రాష్ట్రం విడిపోయినంత మాత్రాన బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు పోతాయా! హద్దులు భూమికే గాని మనసులకు కాదు గదా. తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రెండో వ్యక్తి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా కేరింతలు కొట్టడం, ఆనందోత్సాహాలు వ్యక్తం కావడం సహజమే. కాని చిత్రంగా ఆంధ్రలోని ఓ సంపన్న ప్రాంతంలో కూడా సందడి నెలకొంది.
రేవంత్ అల్లుడిది భీమవరమే
ఈ పట్టణం పేరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. అక్కడ సందడికి కారణం రేవంత్ రెడ్డి వియ్యంకుడు అక్కడ ఉండడం. రేవంత్ రెడ్డి కుమార్తెను భీమవరం కుర్రాడు వివాహం చేసుకున్నారు, రేవంత్ వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సందడి సందడిగా ఉంది. రేవంత్‌రెడ్డి వియ్యంకుడు, రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూం అధినేత వెంకటరెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.