అనుచితంగా ప్రవర్తించారని ఆ ఎంపీ సస్పెండ్
x
చైర్మన్ జగదీప్ ధన్ కర్

అనుచితంగా ప్రవర్తించారని ఆ ఎంపీ సస్పెండ్

రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ సస్పెండ్ అయ్యారు. అనుచిత ప్రవర్తనపై ఆయనను సభ నుంచి శీతాకాల సమావేశాలను వరకూ సస్పెండ్ చేశారు.


సభలో చైర్మన్ తో వాదనకు దిగడం, అనుచితంగా ప్రవర్తించడం, నిబంధనలు పాటించకపోవడంతో శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ ఆయనపై సస్పెన్షన్ విధించామని చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే లోక్ సభలో భద్రతా వైఫల్యంపై చర్చ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి ప్రకటన చేయాలని ఆందోళనకు దిగాయి. వెల్ లోకి దూసుకెళ్లిన సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చైర్మన్ సభ్యులకు సర్ధి చెప్పిన పరిస్థితులు అదుపులోకి రాలేదు.

ఇదే సమయంలో టీఎంసీ ఎంపీ డెరిక్ వెల్ లోకి దూసుకెళ్లారు. చైర్మన్ ను ఉద్దేశించి గాల్లోకి చేతులు విసిరారు. దీంతో కోపోద్రిక్తుడైన జగదీఫ్ ధన్ కర్.. డెరిక్ పేరు చెప్పి సభ నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. చైర్మన్ పేరు చెప్పి సభ నుంచి వైదొలగమని ఆదేశిస్తే ఆ ఎంపీ ఆరోజు సభ ప్రోసిడింగ్స్ నుంచి వైదొలగవలసి ఉంటుంది. అనంతరం పియూష్ గోయల్ లేచి డెరిక్ ఓబ్రియన్ ను మిగిలిన శీతాకాల సమావేశాలకు వరకూ సభకు రాకుండా సస్పెండ్ చేసే తీర్మానాన్నిప్రవేశపెట్టారు.

రాజ్యసభ చైర్మన్ పై అనుచిత ప్రవర్తనపై సభ నుంచి బయటకు పంపించడానికి ఓటింగ్ పెట్టారు. అనంతరం ఆయనను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశారు. ‘తానాషాహీ నహీ చలేగీ’( నియంతృత్వం నడవదు) అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.

సాగర్ శర్మ, మనోరంజన్ బుధవారం విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్ సభలోకి దూకి టియర్ గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. షూస్ నుంచి ఆగంతకులు పసుపు గ్యాస్ తీసి స్ప్రే చేశారు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ బయట మరో ఇద్దరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా ఇదే రోజు 22 సంవత్సరాల క్రితం పార్లమెంట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగింది. అప్పుడు తొమ్మిదిమంది అమరులయ్యారు. ఈ ఘటనలు పార్లమెంట్ లోని భద్రతా వైఫల్యాలను బయటకు తీసింది. దీనిపై గురువారం రెండు సభలు ఆందోళనలతో దద్దరిల్లాయి.

Read More
Next Story