ఐదోసారి అదే రేటు.. ఆర్బీఐ సమీక్షలో పలు నిర్ణయాలు
x
RBI office mumbai

ఐదోసారి అదే రేటు.. ఆర్బీఐ సమీక్షలో పలు నిర్ణయాలు


భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ద్రవ్యవిధాన పరపతి సమీక్ష వివరాలు వెల్లడించింది. వరుసగా ఐదోసారి రెపోరేట్ ను 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్భణంపై గట్టి నిఘా కొనసాగుతుందని, అందుకే రేట్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు వరుసగా ఆరు పరపతి సమీక్షలో 250 పాయింట్లను పెంచిన ఆర్బీఐ, ఏప్రిల్ తరువాత రేట్లను ఇదే విధంగా స్థిరంగా కొనసాగిస్తోంది. అలాగే భారత వృద్ధిరేట్ ను ఈ ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచినట్లు ఆయన వెల్లడించారు.

2023 చివరి నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచుతామని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని వెల్లడించారు. అలాగే వినియోగధారుల ధరల ఆధారిత ద్రవ్యోల్భణం సూచీని 5.4 శాతంగా అంచనా వేసింది. అక్టోబర్ లో ద్రవ్యోల్భణం 4.87 శాతానికి తగ్గిన నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానంపై సభ్యులు చర్చించారు. నవంబర్ నివేదిక వచ్చే నెల విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

Read More
Next Story