ఏపీ రాజధాని మార్పు లేదు.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ


ఏపీ రాజధాని మార్పు లేదు.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
x
Amaravati master plan

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతే ఏపీ రాజధాని స్పష్టం చేసింది. మూడు రాజధానులు, రాజధాని త్వరలో విశాఖపట్నానికి తరలిపోతుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ ఈ వివరణ ఇచ్చారు.

అమరావతి మాస్టర్‌ ప్లానే ఖరారు..
అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను కేంద్రం ఆమోదించినట్లు కేంద్రం మరోసారి చెప్పింది. 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం రిలీజ్‌ చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
రాజ్యసభలో కేంద్రమంత్రి ఏమన్నారంటే...
రాజ్యసభలో ఎంపీ జావెద్‌ అలీఖాన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ ప్లాన్‌ లేదనేది నిజమా కాదా అని ఎంపీ జావెద్‌ ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ ప్లాన్‌ లేదన్న మాట అవాస్తమం. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ప్లాన్‌ ఉంది‘ అన్నారు కేంద్ర మంత్రి. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్‌ రాజధాని కోహిమాల మాస్టర్‌ ప్లాన్లు మినహా అన్ని రాష్ట్రాల రాజధానుల మాస్టర్‌ ప్లాన్లను కేంద్రం ఆమోదించింది.
Next Story