ఏపీ నుంచి రాజ్య సభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు బీజేపీ నుంచి పోటీ చేశారు.


రాజ్య సభకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్య సభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈ నెల మూడో తేదీన మూడు ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేసింది. మూడు ఖాళీలకు నిర్ణీత గడువులోపు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఒకరి నామినేషన్‌ పరిశీలనలో తిరస్కరణకు గురైంది. మరో ఇద్దరు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే పోటీలో నిలిచారు. దీంతో ఆ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సానా సతీష్‌ బాబు, బీదా మస్తాన్‌రావు, టీడీపీ నుంచి గెలుపొందగా, ఆర్‌ కృష్ణయ్య బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌ వనితారాణి శుక్రవారం ప్రకటించారు.




Next Story