Tirumala Special Days January 2025 - తిరుమలలో జనవరి నెలలో జరిగే విశేష పర్వదినాలివే..!
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తేదీల వారీగా పూర్తి వివరాలను వెల్లడించింది. జనవరి 9న చిన్న శాత్తుమొరతో ప్రారంభమై. 29వ తేదీ శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాల వరకు విశేష పర్వదినాలను వెల్లడించింది.
విశేష పర్వదినాలు వివరాలు
- జనవరి 09: చిన్న శాత్తుమొర.
- జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.
- జనవరి 11: వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.
- జనవరి 15: ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.
- జనవరి 17: తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం.
- జనవరి 19: పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
- జనవరి 20: శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జనవరి 23: అధ్యాయనోత్సవాలు సమాప్తం.
- జనవరి 24: తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.
- జనవరి 25: సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం.
- జనవరి 27: మాస శివరాత్రి.
- జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు.
Next Story