వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐపై బదిలీవేటు
ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషనుకు వెళితే ఎస్ఐ ప్రవీణ్ తనను లైంగికంగా వేధించాడని ఓ వివాహిత నల్గొండ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.దీంతో ఎస్పీ ఎస్ఐను బదిలీ చేశారు.
తన భర్త తనను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తాను ఫిర్యాదు చేయడానికి శాలిగౌరారం పోలీసు స్టేషనుకు వెళితే తనను ఎస్ఐనే అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
- తనను వదిలి మరో పెళ్లి చేసుకోవడంతోపాటు సెటిల్ మెంట్ పేరుతో తన పిల్లల పేరిట కొంత భూమి రాసిస్తానని భర్త కుటుంబసభ్యులు పెద్ద మనుషులతో చెప్పించారని వివాహిత ఫిర్యాదులో పేర్కొన్నారు.
- తాను తండ్రితో కలిసి పోలీసుస్టేషనుకు వెళితే తనతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి నాన్నను బయటకు పంపించాడని ఎస్ఐపై మహిళ ఆరోపించారు. ‘‘మీ పెళ్లి ఎప్పుడు అయింది? పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావు ? నీకు చేపల కూర చేయడం వస్తే బయట కలుద్దామని చెప్పాడు’’ అని బాధితురాలు చెప్పారు. తన ఫోన్ నంబరు తీసుకొని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయాలని, అన్ని విషయాల్లో తోడుంటానని చెప్పాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
స్టేషనులో గ్రీన్ టీ పెట్టించాడు...
కేసు విచారణ కోసం తనను పోలీసుస్టేషనుకు పిలిపించి గ్రీన్ టీ పెట్టించారని బాధిత మహిళ ఆరోపించారు. చికెన్ ఫ్రై, చేపలు వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతోపాటు వాట్సాప్ మెసేజ్ చేశారని మహిళ ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను గంటన్నర సేపు తన రూమ్ లో నిలబెట్టి నానా మాటలు అన్నాడని బాధితురాలు ఆవేదనగా చెప్పారు. ఏదైనా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేయమన్నాడని మహిళ చెప్పారు. ఎవరికైనా చెబితే తనతోపాటు తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని ఎస్ఐ హెచ్చరించాడని బాధితురాలు చెప్పారు.
జిల్లా ఎస్పీకి వివాహిత ఫిర్యాదు
పిర్యాదు చేసిందు కు శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు వెళితే ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల ఓ వివాహిత పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆమె సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం వాసా ప్రవీణ్ కుమార్ ని వేకెన్సీ రిజర్వుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ప్రవీణ్ స్థానంలో నూతన ఎష్ఐ గా సైదులును ఎస్పీ నియమించారు.
Next Story