
TTD || టిటిడి వెబ్‌సైట్‌లోనే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టిటిడి విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే వినియోగించాలని టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం విజ్ఞప్తి చేస్తోంది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్టు పలువురు భక్తుల నుండి టిటిడికి పలు ఫిర్యాదులు అందాయి.
ఈ మేరకు టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అధికారులు నకిలీ వెబ్‌సైట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు . తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన సమాచారం కోసం మరియు శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://TTDevasthanam.ap.gov.in మాత్రమే ఉంది.
ఈ వెబ్‌సైట్ కు సంబంధించిన సమాచారం, ఇతర వివరాల కోసం టిటిడి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించగలరు. అని టిటిడి తెలిపింది.