డిసెంబర్ 13, 2001: పార్లమెంటు వొంటి మీద మానని గాయం
ఆ రోజు పార్లమెంటు మీద జరిగిన దాడికి 22 యేళ్లు. దేశాన్ని కుదిపేసిన ఆరోజు అసలేం జరిగిందంటే...
అప్పుడు ఏం జరిగింది. ఎంతమంది బలిదానం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంపైకి దాడికి తెగబడేంత బలమైన కారణం ఏంటీ.. అసలు దొంగలు ఎవరూ?
ఈ రోజుకి పార్లమెంట్ పై ఆ రోజు ఉగ్రవాద దాడి జరిగి 22 సంవత్సరాలు. నాటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదిమంది భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఇతర నాయకులు నిమిషం పాటు మౌనం పాటించారు.
సరిగ్గా 22 సంవత్సరాల క్రితం
డిసెంబర్ 13, 2001 ఉదయం పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. సభలో అధ్యక్ష స్థానంలో కూర్చుని ఉన్నది ఎవరో కాదు, నాటి స్పీకర్ జిఎంసి బాలయోగి. జీరో అవర్ ప్రారంభం కావడానికి కంటే ముందే జరిగిన సెషన్ లో ప్రధాని వాజ్ పేయ్ పాల్గొని తిరిగి వెళ్లిపోయారు. తరువాత 11.40 లకు ఢిల్లీ లో రిజిస్టర్ అయిన తెల్లటి కారులో ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణానికి వేగంగా వచ్చారు. కారు విండ్ షీల్డ్ పై హోంమంత్రిత్వ శాఖ నకిలీ స్టిక్కర్ తో వచ్చి అక్కడ నిలిపి ఉన్న అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ ను బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో నుంచి దిగిన ఐదుగురు ఉగ్రవాదులు ఏకే-47 తుఫాకులతో పార్లమెంట్ ఆవరణలో భీభత్స కాండకు దిగారు. వెంటనే భద్రతా దళాలు ఎదురుదాడి ప్రారంభించారు. అయితే అది అనుకున్నంత సులువుగా ఏం జరగలేదు. దాదాపు గంట సేపు హోరాహరీ కాల్పలు జరిగాయి. పార్లమెంటు ఆవరణలో ఈ కాల్పుల సద్దమణి గే సరిగి అరగంట పట్టింది. ఐదుగురు తీవ్రవాదలు హతమయ్యారు, ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ఈ దాడిలో మరణించారు.మరొక పదిహేను మంది గాయపడ్డారు. విశేషేమిటంటే, తీవ్రవాదులు పార్లమెంటు సెంట్రల్ హాల్ లోకి ప్రవేశించే ప్రయత్నించారు. ఒక వేళ అదే జరిగిఉంటే మారణకాండ చూడాల్సి వచ్చేది. ఎందుకంటే, అంతకు కొద్ది సేపటి ముందు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దీనితో సభ్యులంతా పార్లమెంటు సెంట్రల్ హాల్ కిచేరుకున్నారు.పార్లమెంటు సభలు జరగనపుడు సభ్యులంతా కూర్చునే విశాలమయిన హాల్ సెంట్రల్ హల్.
పార్లమెంట్ లో ఉన్నమంత్రులు, ఎంపీలు
ఉగ్రవాద దాడి జరగడానికంటే ముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్, ఇతర ప్రాంగణాలు అంతా కోలాహాలంగా ఉన్నాయి. మీడియా సంస్థల ప్రతినిధులు, సందర్శకులు అంత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. దాదాపు వందకు పైగా ఎంపీలు అక్కడే ఉన్నారు. వారిలో హోంమంత్రి లాల్ కృష్ణ అద్వానీ సైతం ఉన్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా ధన్ ధన్ మంటూ చప్పుళ్లు వినిపించాయి. ఎవరికి ఏం అర్థకాక చప్పుడు వినిపించిన వైపు పరుగెత్తుకు వచ్చారు. అయితే అప్పటికే అలర్ట్ గా ఉన్న భద్రతా సిబ్బంది పార్లమెంట్ లోపలికి వెళ్లే అన్ని గేట్లను మూసివేశారు.
నిజానికి తీవ్ర వాదుల లక్ష్యం కూడా పార్లమెంట్ లోపలకు వెళ్లడమే. వాళ్లు నేరుగా ఒకటో నెంబర్ గేట్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. దానిని పగలగొట్టడానికి విఫలయత్నం చేశారు. అలా వచ్చిన వారిలో నలుగురి తీవ్రవాదులని ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఈ సందర్భంగా ఓ తీవ్రవాది తన శరీరం పై చుట్టుకున్న బాంబులు పేలడంతో భీతావాహ పరిస్థితి ఏర్పడింది.
పార్లమెంట్ పై దాడి జరిగే సమయం వరకూ ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ అంటూ ఏమి లేదు. ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది, పార్లమెంటు సెక్యూరిటీలో ఉన్న సిఆర్ పి ఎఫ్ సిబ్బంది శక్తి మేరా వాళ్లని ఎదిరించి తీవ్రవాదులు పార్లమెంటులోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ కాల్పులు జరుగుతున్నపుడే పార్లమెంటుగేట్లన్నీ మూసేశారు. తీవ్రవాదులను మొదట గమనించి కేకలు వేసింది పార్లమెంటు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సిఆర్ పిసి కాన్ స్టేబుల్ కమలేశ్ కుమారి. అయితే, ఆమె తీవ్రవాదులు వెంటనే కాల్చి చంపారు.
దేశానికంతటికీ సవాల్
ఈ సంఘటన అనంతరం ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ “ఇది పార్లమెంటు మీద జరిగిన దాడి మాత్రమే కాదు, దేశానికంతటికి ఒక హెచ్చరిక, ఈ సవాల్ ను మేం స్వీకరిస్తున్నాం,” అని ప్రధాని ప్రకటించారు.
దాడి చేసింది పాక్ తీవ్రవాదులు: అద్వానీ
అప్పటికే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించిన పాక్.. ఆఫ్ఘన్ యుద్దం తరువాత మొదట జమ్మూకశ్మీర్ కు.. తరువాత దేశం మొత్తానికి విస్తరింపజేసింది. ఇందుకోసం లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహ్మద్ అనే రెండు ఉగ్రసంస్థలు కలిసి ఐదుగురు ఆత్మాహుతి దళ సభ్యులన్ని సిద్దం చేయించింది. వారంతా పాకిస్తాన్ జాతీయులు.
పాకిస్తాన్ లో శిక్షణ పొంది పార్లమెంట్ పైకి దాడి చేయడానికే ఢిల్లీ వచ్చారు. వాళ్లకు సహకరించింది మాత్రం భారతీయులే. వాళ్లను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఉగ్రవాది అప్జల్ గురు, అతని సమీప బంధువు షౌకత్ హుస్సెన్ గురు, అతని భార్య అఫ్సాన్ గురు, ఎస్ ఆర్ జిలానీ లు ఉగ్రవాదులకు సాయమందించారు.
తరువాత ట్రయల్ కోర్టు గురు, గిలానీ,షౌకత్ లకు మరణ శిక్ష విధించింది. అఫ్సాన్ నిర్థోషిగా విడుదల అయ్యారు. తరువాత జిలానీ సైతం నిర్దోషిగా విడుదల కాగా, షౌకత్ కు పది సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. అప్జల్ గురుకు మాత్రం 2006లో మరణ శిక్ష విధించబడింది. 2013లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష తిరస్కరించడంతో ఫిబ్రవరి 3న తీహర్ జైలులో ఉరి తీశారు.