భార్యల చేష్టలకు ఇద్దరు భర్తలు బలి
x
భార్యాభర్తల మధ్య రాజుకున్న వివాదం

భార్యల చేష్టలకు ఇద్దరు భర్తలు బలి

హైదరాబాద్ నగరంలో వేర్వేరు కేసుల్లో ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.


భర్తలపై భార్యలు పెట్టిన పోలీసు కేసులతో ఆవేదన చెందిన ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలు హైదరాబాద్ నగరంలో తాజాగా జరిగాయి. నగరంలో రెండు వేర్వేరు కేసుల్లో భార్యలు తమపై పోలీసు కేసు పెట్టారనే వేదనతో ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.


భర్తపై భార్య హత్యాయత్నం కేసు
రాజేంద్రనగర్ కు చెందిన ఎర్పుల క్రిస్టప్ప అలియాస్ క్రిస్టోఫర్ (28) కొన్నేళ్ల క్రితం గంజి సుమలతను వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతులు చిన్న సమస్యలతో తరచూ గొడవ పడుతుండేవారు. ఈ గొడవతో తన భర్త తనపై హత్యాయత్నం చేశాడంటూ భార్య సుమలత భర్త క్రిస్టోఫర్ పై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉరి వేసుకొని ఆత్మహత్య
తన భార్య సుమలత తనపై పోలీసు కేసు పెట్టడంతో భర్త క్రిస్టోఫర్ ఆవేదనకు గురై మాదాపూర్ లోని హోటల్ కు వచ్చి గదిని అద్దెకు తీసుకున్నాడు.క్రిస్టోఫర్ బెడ్ షీట్ సహాయంతో పై కప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. భార్య సుమలత ఇంట్లో తరచుగా గొడవలు పడుతుండటంతో వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో కేసులో...
యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణ నగర్‌లో నివసిస్తున్న కె.సాంబమూర్తి అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం లావణ్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.గత కొన్ని నెలలుగా సాంబమూర్తి ఆర్థిక సమస్యల కారణంగా తన జీతంలో కోత విధించడంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇంటి ఖర్చులకు సంబంధించిన విషయాలపై సాంబమూర్తి అతని భార్య లావణ్యలు ఇంట్లో తరచుగా గొడవ పడుతుండేవారు.

భార్యపై అనుమానంతో...
తన భార్య ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని, అతనితో ఫోన్‌లో మాట్లాడుతుందని భర్త సాంబమూర్తి అనుమానించాడు. ఆ అనుమానం అతన్ని మరింత దూకుడుగా మార్చిందని జూబ్లీహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు.కొన్ని వారాల క్రితం లావణ్య మహిళా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి భర్త సాంబమూర్తిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ జంటకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి సాంబమూర్తి నిరాశకు గురై ఆదివారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రావణ్ కుమార్ రెడ్డి చెప్పారు.


Read More
Next Story