అభ్యర్థులిద్దరిదీ ఇదే మాట. ప్రజలకు సేవ చేయాలని అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ. మరొకరు చంద్రబాబు, లోకేష్‌పై ఒంటి కాలితో లేచే మాస్‌ రాజా.


జి విజయ కుమార్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీ గుడివాడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కొడాలి నాని, వెనిగండ్ల రాములది ఒకటే మాట. గెలుపు ఓటములు మా చేతుల్లో లేవు. అంతా పైవాడి దయ. మాదేముంది. నిమిత్త మాత్రులం అంటున్నారు. వెరైటీగా ఉంది కదూ. అవును ఇది నిజమే. ఒక సారి టీడీపీ అభ్యర్థి గురించి తెలుసుకుందాం. వెనిగండ్ల రామును గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ పెద్దలు ఖరారు చేశారు. ఆయనది గుడివాడ మండలం, నందివాడ గ్రామం. బాగా చదువుకున్నారు. కుటుంబ అవసరాలతో పాటు నాలుగురు నన్ను గౌరవించాలంటే డబ్బు కావాలనుకున్నారు. అందుకు విదేశీ ఉద్యోగమే సేఫ్‌ అనుకున్నారు. ఆ వైపుగా ప్రయత్నం చేశారు. నిజానికి ఆయనది ఓ మధ్య తరగతి రైతు కుటుంబం. డబ్బు లేదని, విదేశాలకు పోలేనని, నేను ఏ ప్రయత్నం చేసినా వృధా శ్రమని అతను అనుకోలేదు. ప్రయత్నం చేస్తే పోయేదేముంది సఫలం అవుతే అవుతాం. కాకుంటే కాము. ఇది అతని మనసులోని మాట. ఈ మాటకే ఎక్కువ విలువనిచ్చారు రాము. కార్య సాధన వైపు విల్లు ఎక్కు పెట్టారు. అనుకున్న లక్ష్యం ఫలించేలా మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అమెరికాకు వెళ్లారు. అప్పటికే ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేసిన రాము ఏ మి చేస్తే బాగుంటుందనే ఆలోచనల్లో తలమునకలయ్యారు.
ఎఫిసెన్స్‌ సిస్టమ్స్‌ సంస్థ ఏర్పాటు
ఇక్కడే ఎఫిసెన్స్‌ సిస్టమ్స్‌ సంస్థ ఏర్పాటుకు పునాది పడింది. అమెరికన్‌ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించారు. అక్కడ కాంపిటిటివ్‌ పరీక్షలకు గొప్ప ప్రేయారిటీ ఉంటుంది. దాన్ని గుర్తించారు రాము. పోటీ పరీక్షల్లో ఏ మెటీరియల్‌ను చదువుకుంటే నెగ్గుతారో క్షుణ్ణంగా గమనించారు. ఆ మెటీరియల్‌ను తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది రాముకు వెన్నతో పెట్టిన విద్య. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థుల వివరాలను కొంత వరకు సేకరించగలిగారు. వాళ్లందరికీ ఒక సందేశం పంపించారు. పోటీ పరీక్షల్లో మీరు నెగ్గాలంటే మా ఇనిస్టిటూష్యన్‌కు మీరు మెసేజ్‌ పంపండి. మేము మెటీరియల్‌ను సప్లై చేస్తాం. అందుకు అయ్యే ఖర్చులో మీరు ఎంత మొత్తంలో భరించాలో కూడా చెబుతాం. నచ్చితేనే మెటీరియల్‌ను కొనుగోలు చేయండి లేదంటే వద్దనేది ఆ మెస్సేజ్‌ సారాంశం. ఆ మెస్సేజ్‌కు ఆకర్షితులైన నిరుద్యోగులు ఎంతో మంది మెటిరీయల్‌ కోసం సమాచారం పంపించారు. ఆన్‌లైన్‌ ద్వారానే మెటీరియల్‌ను వాళ్లకు పంపడం మొదలుపెట్టారు. అదృష్ట వశాత్తు అది క్లికయ్యింది. అలా ఆయన కోట్లకు అధిపతి అయ్యారు. ఇప్పుడు అమెరికాలో ఎఫెసెన్స్‌ సిస్టమ్స్‌ సంస్థ పేరు చెబితే గుర్తించని వారంటూ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా డబ్బు సంపాదించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
సొంతూరు వైపు చూపులు
కోట్లాది రూపాయాలు సంపాదించిన రాము అంతటితో ఆగ లేదు. ఎలాగైనా కన్నతల్లికిచ్చే విలువను రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల ద్వారా గుడివాడ నియోజక వర్గానికి కూడా అందించాలనుకున్నారు. అభివృద్ధి చేయాలనుకున్నారు. అదెలా సాధ్యమని ఆలోచించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం మార్గమొక్కటే ఏకైక మార్గమని భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో తన బందువుల ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అప్రోచ్‌ అయ్యారు. తాను చేస్తోన్న వాయపారం, తన ఆదాయం, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎయిమ్‌ గురించి లోకేష్‌కు వివరించారు. దాన్ని సంతోషంగా స్వీకరించిన లోకేష్‌ మీకెప్పుడు నేను అండగా ఉంటా అని అభయమిచ్చారు. పాలిటిక్స్‌లోకి ఇన్‌వైట్‌ చేశారు. గుడివాడ నుంచి టికెట్‌ ఇప్పిస్తా. పోటీ చేయండి, తాడో పేతో తేల్చుకుందాం, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని లోకేష్‌ రామును ఎంకరేజ్‌ చేశారు. దానికి ఓకే చెప్పిన రాము వెనుదిరిగి చూడ లేదు. చంద్రబాబుతో మాట్లాడి టికెట్‌ ఇప్పించారు లోకేష్‌. అంతటితో ఆగారా? లేదు. విజయవాడ ఎంపీ స్థానాన్ని కూడా మనం ఎలాగైనా కైవసం చేసుకోవాలని లోకేష్‌ చెప్పిన మాటలను ఒక సారి మసనులో మననం చేసుకొని ఏమి చేద్దామని లోకేష్‌ వద్దే చర్చ పెట్టారు. అందుకు లోకేష్‌ చెప్పింది ఒక్కటే. నా దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నానిని ఓడించ గలిగే సత్తా ఉన్న ఒకే ఒక్కడు ఆయన తమ్ముడు కేశినేని చిన్ని. ఇక మీ ఇష్టం. ఖర్చు వ్యవహారాలు మీరే చూసుకోవాలి. అతనికి కూడా టికెట్‌ ఇప్పించే బాధ్యత నాది. గెలుపు ఓటములంటావా నాకు కొత్తేమి కాదు. తర్వాత ఆలోచిద్దాం. నువ్వు రెడీనా. నేను రెడీ అన్నారు లోకేష్‌. సార్‌ మీరు చెప్పిన తర్వాత కాదనేది ఏముంటుంది. అతని గతం గురించి నాకు నాలుగు మాటలు చెప్పండి. అవసరమైతే మన సంస్థలో పార్టనర్‌గా చేర్చుకుందాం. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించే అవకాశం లేకుండా చేద్దాం. అంటూ అభయం ఇచ్చారు లోకేష్‌కు రాము. ఇంకేముంది. చెప్పిందే తడువుగా చిన్నిని తన కంపెనీలో రాము చేర్చుకున్నారు. అంతేకాకండా పార్టనర్‌షిప్‌ కూడా ఇచ్చారు. ఇప్పడు నెలకు చిన్ని ఆదాయం ఎంతో తెలుసా?. ఇప్పుడు చిన్ని ఆదాయం నెలకు సుమారు రూ. 30 కోట్లు. నిన్న మొన్నటి వరకు సాధారణ పారిశ్రామిక వేత్తగా ఉన్న కేశినేని చిన్ని ఒక్క సారిగా కోట్లకు ఎలా పడగలెత్తారో ఇప్పుడు తెలిసిందిగా.
ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌
వెనిగండ్ల రాముది కులాంతర వివాహాం. భార్యది ఎస్సీ, ఆయనది కమ్మ సామాజిక వర్గం. భార్య తండ్రి ఒక పాస్టర్‌. అప్పట్లో ఇదొక సాహసమేనని చెప్పాలి. అయినా దేనికి బెదరకుండా రాము ముందుకు సాగారు. ఆయన అల్లుడు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యకి కావడం విశేషం. అలా కులాలకు అతీతంగా కుటుంబాన్ని తీసుకెళ్లారు. రాజకీయాల్లో రావడానికి ముందు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించారు. అనకున్నది తడువుగా వెనిగండ్ల ట్రస్టును నెలకొల్పారు. ఇక సేవాకార్యక్రమాలు షురూ చేశారు. గ్రామాలకు మంచి నీటి సరఫరా, అవసరమైన చోట్ల ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజనం వంటి అనేక కార్యక్రమాల నిర్వహిస్తూ నియోజక వర్గం ప్రజలకు చేరువయ్యారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి నలుగురు యువకులను ఏర్పాటు చేసుకున్నారు. వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ వారి వారి గ్రామాలలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకొని వాటి పరిష్కారానికి దారులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇది వెనిగండ్ల రాము వ్యక్తిగత చిత్రం.
తిరుగులేని నాయకుడిగా కొడాలి నాని
ఇక గుడివాడలో తిరుగు లేని నాయకుడుగా చలామణి అవుతున్న నాయకుడు కొడాలి నాని. 2004 నుంచి ఇప్పటి వరకు గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాస్‌ లీడర్‌గా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఫోన్లు చేసినా రెస్పాండ్‌ కావడం లేదని, పరిష్కారంలో చొరవ చూపడం లేదని స్థానికుల మాటల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమాలతో దూసుకొని వెళ్తున్న వెనిగండల్ల రామును కొడాలి నాని ఎలా ఎదుర్కొంటారు. ఆయన రాజకీయ ఆర్థిక బలమేంది. ఐదేళ్లుగా నియోజక వర్గంలో ప్రజల చెంత ఉండి వారి చింతలు తీర్చడంలో విఫలం అయినట్లు చెప్పుకుంటున్న గుడివాడ ప్రజలకు నాని స్థానికులకు ఏమి సమాధానం చెబుతారు. ఎలా అక్కడి ప్రజలను కన్వెన్స్‌ చేస్తారో మనం ఎన్నికల వెండి తెరపై చూడాల్సిందే. ఇదే బ్రీఫ్‌గా గుడివవాడ అసెంబ్లీ నియోజక వర్గం హిస్టరీ. ఇక ముగిసింది.
Next Story