కేంద్రం బృందాన్ని పంపించాలని కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం ఇంకా పంటపొలాల్లోనే వరద నీరు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేదెప్పుడు


ప్రాధమిక అంచనా ప్రకారం 1.45,795 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం

తడిసిన,రంగుమారిన ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపుకు కేంద్రానికి లేఖ
ముఖ్యమంత్రి ఆమోదంతో తుఫాను నష్ట పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది.
ప్రస్తుతం ప్రాధమిక అంచనా ప్రకారం 1,45,795 హెక్టార్లలో వరి,31,498 హెక్టార్లలో వివిధ ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింప జేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తడిసిన,రంగు మారిన ధాన్యం సేకరణకు సంబంధించిన నిబంధనల సడలింపునకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది.
పునరావాస కేంద్రాల్లోని వారికి సాయం అందజేత
పునరావాస కేంద్రాలల్లో చేర్చిన 9,321 కుటుంబాలకు కుటుంబానికి రూ. 2,500 వంతున సహాయం, పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒకే వ్యక్తి అయితే రూ. 1,000 వంతున 1,162 మందికి సహాయం కింద మొత్తం సుమారు రూ. 2.50కోట్లు సహాయం ప్రభుత్వం అందించింది. అదే విధంగా తుఫానుకు ప్రభావితమైన లక్షా 1 వేయి కుటుంబాలకు గాను ఇప్పటికే 65,256 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మిగతా కుటుంబాలకు త్వరగా అందించడం జరుగుతోందని సీఎస్‌ తెలిపారు.
ఇంధన శాఖకు..
9 జిల్లాల్లో 33 కెవి ఫీడర్లు 210 తోపాటు 11కెవి ఫీడర్లు 1581,అదే విధంగా 33/11కెవి ఫీడర్లు 353 తుపాన్‌ ప్రభావానికి గురయ్యాయి. 33 కెవి స్తంభాలు 379 దెబ్బతినగా 11కెవికి సంబంధించి 1,592 స్తంభాలు, 2,481 ఎల్టి పోల్స్‌ దెబ్బతిన్నాయి. ఇవన్నీ పునరుద్దరించే పనిలో ట్రాన్స్‌కో వారు ఉన్నారు. మొత్తం 3,292 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా 3,111 గ్రామాలకు విద్యుత్‌ పునరుద్దరించారు. ఇంకా 181 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ జరుగుతోంది.
వ్యవసాయ శాఖకు..
తుపాన్‌ వల్ల 92,577 హెక్టార్లలో వరి నీట మునగగా, 53, 218 హెక్టార్లలో వరి నేలకొరిగింది. 1.45 లక్షల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నతి. ఈనెల 11నుండి పంట నష్టం అంచనా ఎన్యుమరేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అదే విధంగా 31,498 హెక్టార్లలో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన వన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పశు సంపద, బోట్లు, వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సబంధించి 55 రహదారులు 93.8 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నాయి.
2,816 కిలో మీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 14 స్థానిక సంస్థల్లో 56.7 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతినడంతో పాటు 2,770 వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి.


Next Story