ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందంటారు?
x
సీఎం రేవంత్ రెడ్డి

ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందంటారు?


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజా దర్భారు అనంతరం ఢిల్లీ వెళ్లారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తన సహచరులకు ఏఏ శాఖలు కేటాయించాలో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఏఐసీసీ పెద్దలతో పాటు, కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం కానున్నారు. సామాజిక వర్గాల వారిగా మంత్రులను ఎంచుకున్న రేవంత్ వారికి కేటాయించే శాఖలపై అధిష్టానం ఆశీస్సులు తీసుకునెందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులుగా 11 మంది ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అలాగే మరో ఆరుగురుకి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధన్యం లభించలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read More
Next Story