శ్వేత పత్రాలు కాదు కోత పత్రాలు: హరీష్ రావు
x
హరీష్ రావు

శ్వేత పత్రాలు కాదు కోత పత్రాలు: హరీష్ రావు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై ఈ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలు, అభివృద్ధికి కోత పత్రాలు అవుతాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.


రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేవలం గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఈ సభను వాడుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ పాత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సీఎం పాత గురువు, ఆంధ్ర అధికారులు కలిసి ఓ నివేదిక తయారు చేయించుకున్నారని, వారి పేర్లను కూడా చెప్పాలా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

కేవలం తమకు అనుకూలంగా ఉన్న వాటిని శ్వేత పత్రంలో పెట్టి ఓ కుక్ డ్ స్టోరీ వండారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పుల్లో కార్పొరేషన్ రుణాలకు సంబంధం లేదని ఓ వైపు శ్వేత పత్రంలో చెబుతూనే మరోవైపు వాటిని అప్పుల్లో చూపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి దుష్ర్పచారాలు చేస్తే వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునే తత్వమని చెప్పారు. సొంత ఆదాయ వనరుల్లో 84 శాతం ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మనకంటే ముందు హర్యానా 86 శాతం ఖర్చుతో ముందున్నదని హరీష్ రావు చెప్పారు. తమ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందంజలో ఉందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.

హరీష్ రావు ప్రసంగంలో మధ్యలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఇంకా అధికార మత్తులోనే ఉందని అన్నారు. ఉన్నవాటిని కూలగొట్టి, వారి కమిషన్ కోసమే కొత్త వాటిని కట్టారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Read More
Next Story