ఎందుకోసం ఈ శ్వేత పత్రం: అక్బరుద్దీన్ ఒవైసీ
x
అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే

ఎందుకోసం ఈ శ్వేత పత్రం: అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. జీడీపీ కంటే జీఎస్టీడీపీ మెరుగ్గా ఉందని అన్నారు.


ఒకప్పుడు ఇదే సభలో ఉమ్మది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే నీళ్లు రావని కరెంట్ రాక అంధకారంలో ఉంటారని భయపెట్టారని అయితే అవేం జరగలేదని సభాముఖంగా ప్రస్తావించారు. అసెంబ్లీ నుంచి ఎప్పుడు తప్పుడు సమాచారం వెళ్లకూడదు. ఈ అంకెల్లో రెండు అంటే ఆర్బీఐ, కాగ్ రిపోర్ట్ తీసుకున్నారని, వాటిలోని ఏవి నిజం అంకెలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించిన బ్యూరోక్రాట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని రక్షించేందుకు నేను మాట్లాడుతున్నాను. ఎవరి వైపునో వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం లేదని చెప్పారు. తప్పు జరిగిందని అనిపిస్తే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. ఎలాంటి చర్య అయిన తీసుకోండి. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ రాజకీయంగా బలపడేందుకు మాత్రం వాటిని వాడుకోకూడదని హితవు పలికారు.

తమకు అనుకూలమైన అంశాలనే ప్రభుత్వం శ్వేత పత్రంలో తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏదో జరిగిందనే సమాచారం ప్రజల్లోకి వెళ్లకూడదు. తెలంగాణలో అప్పులు పెరిగాయి... అభివృద్ది పెరిగింది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కూడా శ్వేత పత్రంలో ఉంటాయని ఆశించాను. శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం సమాచారం వాడలేదు. కేంద్రం అప్పులు పది ఏళ్లలో 244 శాతం పెరిగాయి. దానిగురించి ఎందుకు మాట్లాడలేదు. ఎలాంటి షరతులు లేకుండా ఆరు గ్యారెంటీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

ఓక్కో పేజీలో ఒక్కో సమాచారం ఉంచారు. దీన్ని ఎలా నమ్మాలి.. ఓక్కోసారి ఓక్కో రిపోర్ట్ ప్రస్తావించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ కేంద్రం కంటే ముందు ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఆర్బీఐ కూడా చెప్పింది. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉందన్నారు. అలాగే మైనారీటీలు అనుభవిస్తున్న పలు సమస్యలు ప్రస్తావించారు. వాటిని పరిష్కరించాలని కోరారు.

Read More
Next Story