సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను: ప్రభాకర్ రావు
విద్యుత్ శాఖపై మొదటి రోజే సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి సమీక్షకు జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీగా పని చేసిన దేవులపల్లి ప్రభాకర్ రావును తీసుకురావాలని ఆదేశించారు. దీనిపై దేవులపల్లి ప్రభాకర్ రావు స్పందించారు. తనకు ఇప్పటి వరకూ సీఎంఓ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లనని అన్నారు. కాగా, మొదటి రోజు నిర్వహించిన సమావేశంలో సీఎం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించేందుకు కుట్ర జరిగిందని మండిపడ్డారు. విద్యుత్ సరఫరా కోసం 82 వేల కోట్లు అప్పులు చేశారని, పూర్తి వివరాలతో తదుపరి సమావేశానికి రావాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటివరకూ ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.