మధ్యప్రాచ్చం మరోసారి మంటల్లో చిక్కుకోనుందా.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రాబోతుందా? పరిస్థితులన్నీచూస్తే నిజమనే అనిపిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ జనరల్ పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసింది. ఇందులో మొత్తం 11 మంది చనిపోయారు. దీంతో ఇరాన్ ఎన్నడు లేనంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నివేదికల ప్రకారం వచ్చే 48 గంటల్లో దాదాపు రెండు వందల బాలిస్టిక్ మిస్సైల్లు, అంతే సంఖ్యలో డ్రోన్లతో టెల్ అవీవ్ పై దాడులు చేయడానికి ఇరాన్ సిద్దమైనట్లు వెల్లడించింది.
వైమానికి దాడుల్లో ఇద్దరు ఇరానియన్ ఖుద్ ఫోర్స్ జనరల్ లు కూడా మరణించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇజ్రాయెల్ పై దాడికి సిద్దంగా ఉండాలని ఇరాన్ సుప్రీంలీడర్ తన జనరల్స్ ను ఆదేశించినట్లు కొన్ని వార్తలు రావడంతో పశ్చిమాసియా మొత్తం నివురుగప్పినా నిప్పులా మారింది. యుద్దం అంటూ జరిగితే తమ మద్ధతు ఇజ్రాయెల్ కు ఉంటుందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
ఇరాన్ ఎలా దాడి చేయబోతోంది. టెహ్రాన్ ప్రణాళిక ఏంటీ ఇలా పలు విషయాలపై మిచిగాన్ విశ్వవిద్యాలయంలో జాతీయ భద్రతా నిపుణుడు, మాజీ సీనియర్ US తీవ్రవాద నిరోధక అధికారి జావేద్ అలీని ఇలా వివరించారు.
డమాస్కస్ లో జరిగిన దాడి ఈ పశ్చిమాసియాలో కీలకమలుపు అని చెప్పవచ్చు. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ బహిరంగంగా అంగీకరించలేదు. టెల్ అవీవ్ కు- టెహ్రాన్ మధ్య చాలా సంవత్సరాలు ప్రత్యక్షంగా.. పరోక్ష యుద్ధం నడిచింది. ఇప్పుడు రెండు కూడా మాస్క్ లు తీసి ఇక యుద్ధం ప్రారంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు జరిగినట్లు ప్రాక్సీవార్, సైబర్, కోవర్ట్ ఆపరేషన్లకు కాలం చెల్లింది.
ఇరాన్ లోని శక్తివంతమైన విభాగాల్లో ఖుద్ ఫోర్స్ కీలకం. ఇది విదేశాల్లో ఆపరేషన్లలో పాల్గొంటుంది. నేరుగా ఇరాన్ సుప్రీంలీడర్ కి రిపోర్ట్ చేస్తుంది. డమాస్కస్ దాడిలో కీలక అధికారులను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పరిస్థితులు అదుపుతప్పాయి.
ఖుద్స్ ఫోర్స్ చరిత్రలో, దాని ప్రత్యర్థులు చేసిన ఒక ఆపరేషన్‌లో ఇంత మంది అధికారులను ఎన్నడూ కోల్పోలేదు. 2020 జనవరిలో ఖుద్స్ ఫోర్స్ మాజీ చీఫ్ ఖాసీమ్ సులేమానీపై జరిగిన ముఖ్యమైన US దాడి కూడా సంస్థలోని ఇతర సీనియర్ సభ్యులను చంపలేదు.
అయితే ఏప్రిల్ 1న జరిగిన దాడిలో మరణించిన జనరల్‌లలో ఒకరైన మొహమ్మద్ జహెదీ, లెబనాన్‌లోని హిజ్బుల్లా, సిరియన్ ప్రభుత్వం, ఆ దేశంలోని షియా మిలీషియా, గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌తో సంబంధాల నిర్వహణకు ప్రత్యక్ష బాధ్యత వహించాడు. .
ప్రతీకారం తీర్చుకుంటాం
దాడి జరిగిన వెంటనే, సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో సహా ఇరాన్ అధికారులు ఇజ్రాయెల్‌ను బహిరంగంగా విమర్శించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ మాట్లాడుతూ, “ఈ దురాక్రమణ అన్ని దౌత్యపరమైన నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించినట్లు మేము భావిస్తున్నాము. (ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి) బెంజమిన్ నెతన్యాహు గాజాలో వరుస వైఫల్యాలు, అతని జియోనిస్ట్ లక్ష్యాలను సాధించడంలో వైఫల్యం కారణంగా తన మానసిక సమతుల్యతను పూర్తిగా కోల్పోయాడు. అందుకే ఇరాన్ పై దాడికి దిగాడని విమర్శించారు.
ఇజ్రాయెల్ దృష్టిలో డమాస్కస్ ఆపరేషన్‌కు అధికారిక గుర్తింపు లేనప్పటికీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి రియర్ అడ్మ్. డేనియల్ హగారి మాట్లాడుతూ, భవనం దెబ్బతింది. దౌత్యపరంకానీ ప్రదేశంలో వీరు ఎందుకు సమావేశం అవుతున్నారు. ఇజ్రాయెల్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంలోనే కదా.. అని పరోక్షంగా టెల్ అవీవ్ స్పందించింది.
ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది: అమెరికా..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లేదా డ్రోన్ దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. ఖాసీమ్ సులేమానిపై అమెరికా దాడి చేసి చంపిన తరువాత ఇరాన్, ఇరాక్ లో ఉన్న అమెరికా బేస్ లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అవన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత ప్రాక్సీలను అమెరికా దళాలపైకి ఉసిగొల్పింది. దాంతో అమెరికా కూడా సైలెన్స్ గా తన పని తాను చేసుకుంటూ పోయింది.
ఇరాన్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే..
ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న పరోక్ష యుద్ధంలో దాడులు, ప్రతిదాడులు అన్ని కొలిచినట్లు గానే జరిగాయి. వివాదాన్ని పెంచకుండా ఇరు వైపులా కొన్ని కనిపించని జాగ్రత్తలు తీసుకుంటూనే తమ విధానాలను కొనసాగించాయి. ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి రోజులు, నెలలు, సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉంటుంది.
టెహ్రాన్ నిర్ణయాధికారం వివిధ శక్తుల కలయికతో నడపబడుతోంది. 1979లో ఇరాన్ విప్లవం జరిగినప్పటి నుంచి జాతీయ భద్రత అత్యున్నత నాయకుడి చేతుల్లో కేంద్రీకృతమై ఉంది, అంటే ఇరాన్ వ్యూహం, దృక్పథంలో వాస్తవ అధికారం అయతోల్లా ఖమేనీదే. ఇరాన్ మొదట తనకు సాధ్యమయ్యే లక్ష్యాలను గుర్తించి పరిశీలనలు జరుపుతుంది. తరువాత వాటి ఆచరణలో ఎలాంటి సంక్షిష్టతలు ఉన్నాయో పరిశీలించి తదుపరి దాడులకు పన్నాగాలు పన్నుతుంది.
లేదా ఇదే సరైన సమయం అనుకుంటే ఇరాన్ తనకు తానుగా అణు శక్తిగా ప్రకటించుకోవచ్చు. తరువాత ప్రణాళికల్లో ఇరాక్ లో ఉన్న అమెరికా స్థావరాలపై తిరిగి బాలిస్టిక్ మిస్సైల్లు, డ్రోన్లతో దాడులకు దిగడం సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏం చేసిన ఆర్థిక ఆంక్షలు ఆవల చేసే ప్రణాళికల గురించి ఆ దేశ వ్యూహ కర్తలు ఆలోచిస్తూ ఉంటారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాలపై ఇరాన్ దాడికి దిగడం.. అయితే మెజారిటీ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించలేదు. కాబట్టి చాలా దేశాల్లో దానికి దౌత్యకార్యాలయాలు లేవని చెప్పవచు. ఇలా దాడులకు వివిధ కోణాలు ఉన్నాయి. దాడులు జరుగుతాయని చెప్పవచ్చుకానీ, ఎలా జరుగుతాయో అని ఇజ్రాయెల్ కూడా ముందస్తుగా అంచనావేయలేకపోతోంది.
ఇప్పటికే ఇరాన్ ప్రాక్సీ హెజ్ బుల్లా పై దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ ను తీవ్రంగా రెచ్చగొడితే మాత్రం అది నేరుగా ఇరాన్ లోని అనేక లక్ష్యాలపై దాడులకు దిగుతుందనడంలో సందేహం మాత్రం లేదు. అదే జరిగితే అది నేరుగా ఇరాన్ కవ్వించినట్లే అవుతుంది.
బాలిస్టిక్ క్షిపణులకు అతీతంగా, ఇరాన్ సంప్రదాయ ఆయుధాలతో లేదా అసాధారణంగా తీవ్రవాద దాడులతో ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేయవచ్చు.
ఇరాన్ ప్రతిస్పందన విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందా? ఇరాన్ ప్రతిస్పందిస్తే, అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందా? అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా కూడా ఇదే అంశంపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఇక పశ్చిమాసియా అంశాలు తదుపరి దశకు చేరుకున్నాయని అంటున్నారు.
ఒకటి మాత్రం స్పష్టం. ఇరాన్ దాడి చేయకుండా ఉండదు. బెంజమిన్ నెతన్యాహూ కూడా ప్రతీదాడి చేయకుండా ఆగడు. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే భారత్ కూడా ఇరాన్, ఇజ్రాయెల్ కు ఎవరూ వెళ్లరాదని మన దేశ పౌరులకు సూచించాయి. జర్మనీ కూడా తన దేశ విమానాలు ఈ రెండు దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది.